Narayana: సీపీఐ నారాయ‌ణ కాలుకి గాయం కావ‌డంతో క‌ట్టుక‌ట్టిన తిరుప‌తి ఎంపి

Narayana: మాన‌వ‌త్వం విష‌యంలో మిత్రులు, శ‌త్రువులు అనేవి ఉండ‌వు. అసెంబ్లీలో నిత్యం కొట్టుకునే వారు బ‌య‌ట ఇంత స్నేహంగా ఉండ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. ఊళ్లకు ఊళ్లే నీట మునిగాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రాయల చెరువు.. చుట్టుపక్కల ప్రాంత ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.

TheNewsQube-
mp treatment to narayana2
mp treatment to narayana2

పై నుంచి వస్తోన్న వరద కారణంగా చెరువు ఎప్పుడు తెగుతుందో అర్థం కాక చుట్టూ పక్కల ఊర్ల జనాలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో సీపీఐ నాయకుడు నారాయణ బుధవారం రాయలచెరువు సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనుకోకుండా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురిమూర్తి నారాయణకు వైద్యం చేశారు.

ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరుకు చేరుకుని అక్కడి నుండి కొండపైకి ఎక్కారు. సుమారు కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. రాయలచెరువు వద్ద కొండ నుండి దిగే సమయంలో కాలు బెణికింది. కుడి కాలు వెంటనే వాపు రావడంతో నొప్పితో ఆయన పైకి లేవలేక అక్కడే కూర్చుండిపోయారు.

mp treatment to narayana1
mp treatment to narayana1

అయితే అదే సమయంలో చెరువు కట్ట ను పరిశీలించేందుకు వైసీపీ నేతలతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు అటువైపు వచ్చారు. సీపీఐ నారాయణను గుర్తించి పలుకరించారు. కాలు బెణకడంతో నడవలేక కూర్చుండిపోయారని తెలియడంతో వైద్యుడైన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి నారాయణ కాలికి అయిన గాయాన్ని పరిశీలించారు.

ప్రాథమిక చికిత్స చేసి తాత్కాలికంగా కట్టు కట్టారు. అనంతరం వైసీపీ నాయకులు తమ వాహనంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మార్గాని భరత్‌ రామ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. గురుమూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు