Mp bharat: టాలీవుడ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన వైసీపీ ఎంపీ

Mp bharat: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు , థియేటర్ల మూసివేత వ్యవహారం గంద‌ర‌గోళంగా వున్న సంగతి తెలిసిందే. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు గట్టిగా కౌంటరిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు మంత్ర‌లు నాని వ్యాఖ్య‌ల‌కు త‌న‌దైన శైలిలో స్పందించ‌గా, ఇప్పుడు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సంచలన కామెంట్ చేశారు.

mp bharat comments on tollywood industry
mp bharat comments on tollywood industry

తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే వుందని.. ఏపీలో కాదన్నారు. సినీ పరిశ్రమకు మాత్రం 70 శాతం ఆదాయం ఏపీ నుంచే వెళ్తోందని భరత్ అన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ పెట్టడానికి .. టాలీవుడ్ పెద్దలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జగనన్న ఉచిత పథకాల డబ్బులు సినిమా ఇండస్ట్రీ కి వెళ్తున్నాయ్ అంటూ కామెంట్స్ చేశారు.

మరోవైపు ఏపీలో టికెట్ల తగ్గుదల చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకది పెద్ద నష్టమని చెప్పొచ్చు. గ్రామాల్లో, మండలాల్లో టికెట్ల రేట్లు యాభై రూపాయల లోపే ఉన్నాయి. లో క్లాస్‌ టికెట్లు కేవలం ఐదు రూపాయలే ఉండటం గమనార్హం. దీనికితోడు ప్రభుత్వం థియేటర్లపై కఠిన ఆంక్షలు పెట్టాయి

లైసెన్స్ లు, ఆహార శుభ్రత, పార్కింగ్‌ ప్లేస్‌, మెయింటనెన్స్ పేరుతో మరికొన్ని థియేటర్లని సీజ్ చేస్తుంది. తగ్గిన టికెట్ల ధరలతో తమకు గిట్టుబాటు కాకపోవడంతో చాలా థియేటర్లు మూత పడ్డాయి. అధికారికంగా, అనధికారికంగా ప్రస్తుతం ఏపీలో 50-70 థియేటర్లు క్లోజ్‌ అయినట్టు సమాచారం.

నాని ‘శ్యామ్‌సింగరాయ్‌’రిలీజ్ ముందు రోజు తన సినిమా టీమ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది’’ అని నాని వ్యాఖ్యానించారు.

mp bharat comments on tollywood industry1
mp bharat comments on tollywood industry1mp bharat comments on tollywood industry1

నానీ మాట్లాడుతూ…అస్సలు టాలీవుడ్ కి ఈ సమస్య మొదలయ్యింది “వకీల్ సాబ్” నుంచి. అప్పుడే కనుక టాలీవుడ్ నుంచి అందరూ రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఈపాటికే పరిష్కారం అయ్యిపోయి ఉండేది అని సమస్య అయితే నిజంగా ఉంది కదా? అప్పుడే అందరం ఒక థాటి మీదకు వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది అని అన్నారు.