బిడ్డా.. బరిగలతో కొట్టి చంపేస్తాం.. ఎస్ఎస్ రాజమౌళికి బండి సంజయ్ పవర్ ఫుల్ వార్నింగ్
Ajay G - October 31, 2020 / 07:08 PM IST

ఎస్ఎస్ రాజమౌళి.. వివాదాలకు చాలా దూరం. ఆయన గత సినిమాలను తీసుకుంటే ఎక్కువగా వివాదాలు లేవు. కానీ.. ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మాత్రం రాజమౌళి కాస్త వివాదాల్లోకి వెళ్లారనే చెప్పుకోవాలి. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ రానంత వరకు రాజమౌళిని ఎవ్వరూ గెలకలేదు. కానీ.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎప్పుడైతే విడుదలైందో.. ఒక్కసారిగా ఆ సినిమాపై వివాదాలు ప్రారంభమయ్యాయి.

mp bandi sanjay warns ss rajamouli in dubbaka
గిరిజన ఉద్యమకారుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్.. టీజర్ లో ముస్లిం గెటప్ వేసుకుంటారు. ఆ గెటపే ప్రస్తుతం వివాదాలకు కారణం అయింది. కొమురం భీమ్ కు ముస్లిం టోపీ పెట్టడం ఏంటి? ఆయనకు, ముస్లిం టోపీకి ఏంటి సంబంధం? అంటూ రాజమౌళిపై ప్రశ్నల వర్షం కురపించారు.
ఇప్పటికే కొందరు బీజేపీ నాయకులు కూడా రాజమౌళిపై విరుచుకుపడ్డారు. తాజాగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్… ఈ ఘటనను గుర్తు చేశారు. రాజమౌళికి పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. కొమురం భీమ్ కు టోపి పెట్టడం ఏంది రాజమౌళి? నీకు దమ్ముంటే నిజాం రజాకార్లకు బొట్టు పెట్టి సినిమా తీయు… కొమురం భీమ్ కు టోపీ పెట్టి ఎట్లా సినిమా రిలీజ్ చేస్తావో చూస్తాం. ఆయన్ను కించపరిచేలా సినిమా తీసిన రాజమౌళికి గుణపాఠం తప్పదు. మా బిడ్డను కించపరిచినావు. ముస్లిం టోపీ పెట్టినవు. నీకు నిజంగా దమ్ముంటే.. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింకి కాషాయం కండువా కప్పి సినిమా తీస్తావా? నీకు అంత దమ్ముందా? నువ్వు గనుక సినిమా రిలీజ్ చేస్తే.. బరిగలతో కొట్టి చంపేస్తాం.. అంటూ బండి సంజయ్.. రాజమౌళికి ఓ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు.