MLC Kavitha : బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ తలవంచదు.. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత..!

NQ Staff - March 8, 2023 / 12:00 PM IST

MLC Kavitha  : బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ తలవంచదు.. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత..!

MLC Kavitha  : ఢిల్లీ లిక్కర్ స్కామ్ జ్వాలలు తెలంగాణను తాకుతున్నాయి. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. నిన్న మంగళవారం హైదరాబాద్ వ్యాపార వేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. తాను ఎమ్మెల్సీ కవిత బినామీనే అంటూ అరుణ్ రామచంద్ర ఒప్పుకున్నారని ఈడీ స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే మార్చి 10న కవిత విచారణ నిమిత్తం ఢిల్లీకి రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే అదే 10వ తేదీన భారత జాగృతి ఆధ్వర్యంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నోటీసులు రావడంతో తాజాగా వాటిపై స్పందించింది కవిత.

ధర్నా నేపథ్యంలో..

మహిళల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా ఈడీకి పూర్తి స్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్ మెంట్ల నేపథ్యంలో విచారణకు హాజరయ్యే తేదీ విషయంలో న్యాయ సలహా తీసుకుంటాను.

MLC Kavitha Responded ED Notices

MLC Kavitha Responded ED Notices

ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను లొంగదీసుకోలేదు. దేశ అభ్యున్నతి కోసం మేం పోరాడుతూనే ఉంటాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ తల వంచదు అంటూ తెలిపింది కవిత. ఆమె విచారణకు హాజరయ్యే తేదీలో గడుపు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us