MLA Ganta Srinivasa Rao : మాజీ మంత్రి గంటా టీడీపీ లోనే.! ఆ ట్వీటు చెబుతోంది అదేనా.?
NQ Staff - November 26, 2022 / 05:26 PM IST

MLA Ganta Srinivasa Rao : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. ‘ఎవరు పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తాం. చేరికలనేవి నిరంతర ప్రకియలో భాగం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చేరికలపై తుది నిర్ణయం తీసుకుంటారు..’ అంటూ పరోక్షంగా గంటా చేరికపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
వైసీపీలోకి గంటా వెళ్ళిపోవడం దాదాపు ఖాయమనీ, అదే సమయంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు వేరే పార్టీలోకి దూకడమూ ఖాయమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గంటా ట్వీటు వెనుక..
రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులోని ఫొటోపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ కనిపిస్తోంది.

MLA Ganta Srinivasa Rao Will Continue In TDP
సో, గంటా ఇంకా టీడీపీలోనే వున్నారన్నమాట.. ఇకపైనా ఆయన టీడీపీలోనే కొనసాగుతారన్నమాట.. అని తెలుగు తమ్ముళ్ళు, వైసీపీ మద్దతుదారులు చర్చించు కుంటున్నారు.
అయితే, గంటాని వైసీపీలో చేర్చుకోవద్దనీ, చేర్చుకుంటే రఘురామకృష్ణరాజులా వైసీపీకి వెన్నుపోటు పొడుస్తారనీ కొందరు వైసీపీ మద్దతుదారులు అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచిస్తుండడం గమనార్హం.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
#NationalConstitutionDay pic.twitter.com/kPoOfaNzLa— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) November 26, 2022