Minister KTR : జగనన్న పాలన భేష్: తెలంగాణ మంత్రి కేటీయార్.!

NQ Staff - September 22, 2022 / 07:46 PM IST

160146Minister KTR : జగనన్న పాలన భేష్: తెలంగాణ మంత్రి కేటీయార్.!

Minister KTR : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న పాలన బావుంది. కరోనా పాండమిక్ సమయంలోనూ యంగ్ అండ్ డైనమిక్ సీఎం అయిన జగన్ బ్రదర్ మెరుగైన పాలన అందించారు..’ అంటూ కేటీయార్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి తెలంగాణ రాష్ట్ర సమితి తెరవెనుకాల సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్దన్నను నేను..’ అంటూ తెలంగాణ మంత్రి కేసీయార్ పలు సందర్భాల్లో చెప్పారు.

నీళ్ళ పంచాయితీ సంగతేంటి.?

Minister KTR Praising CM Jagan Mohan Reddy

Minister KTR Praising CM Jagan Mohan Reddy

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీ వచ్చినప్పుడు ఎడా పెడా ఇరువైపుల నుంచీ విమర్శలొచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి దుమ్మెత్తిపోసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తూలనాడింది. ఆ తర్వాత అంతా మళ్ళీ మామూలే.

మొన్నీమధ్యనే ఓ సందర్భంలో, ఏపీలోని రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ మంత్రి కేటీయార్. ఆ తర్వాత తన వ్యాఖ్యల ఉద్ద్దేశ్యం ఏపీని కించపర్చడం కాదంటూ కేటీయార్ ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. మరిప్పుడు కేటీయార్, తన ‘జగనన్న’ విషయంలో చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి.?
ఏమోగానీ, టీఆర్ఎస్ – వైసీపీ మధ్య సన్నిహిత సంబంధాల కథేంటో ఎవరికీ అర్థం కావడంలేదు.