Minister Adimulapu Suresh : వీల్ ఛెయిర్‌లో గడప గడపకూ వైసీపీ మంత్రి సురేష్.!

NQ Staff - November 23, 2022 / 02:37 PM IST

Minister Adimulapu Suresh  : వీల్ ఛెయిర్‌లో గడప గడపకూ వైసీపీ మంత్రి సురేష్.!

Minister Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా ప్రతినిథులు, ప్రజల వద్దకు వెళ్ళి.. వారి నుంచి వినతులు స్వీకరించడం, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి చెప్పడం, ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చేయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.

అయితే, ప్రజా ప్రతినిథులు ఎక్కడికక్కడ ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో, తాము వెళ్ళకుండా తమ బంధువుల్నో, కుటుంబ సభ్యుల్నో పంపిస్తున్నారు. కానీ, అధినేత వైఎస్ జగన్ మాత్రం, ‘గడప గడపకూ వెళ్ళాల్సిందే..’ అని ప్రజా ప్రతినిథులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు.

వీల్ ఛెయిర్ మీద వెళ్ళాల్సినంత అవసరమేంటి.?

మంత్రి సురేష్, తన నియోజకవర్గంలో గడప గడపకూ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, వీల్ ఛెయిర్‌లో కూర్చుని ప్రజల వద్దకు వెళ్ళారు. అక్కడ ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించారు.

కానీ, ఇదంతా డ్రమెటిక్‌గా మారి పోయింది. కొంత దూరం వీల్ ఛెయిర్‌లో వెళ్ళి, ఆ తర్వాత కొంత సేపు నడిచి.. ఈ వింత ప్రవర్తన పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి విపక్షాల నుంచి.

దీన్ని పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు చూస్తోంటే, ఇంకొందరు.. అధినేత హుకూం జారీ చేసిన దరిమిలా, విధిలేని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోంది ప్రజా ప్రతినిథులకి.. అన్న వాదన ఇంకో వైపు నుంచి వినిపిస్తోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us