కేసీఆర్ కొంప ముంచబోతున్న మజ్లీస్.. కేసీఆర్ కు తగిన శాస్తి జరగనుందా..?

దుబ్బాక ఓటమితో ఆకాశం నుండి నేల మీదకు దిగిన తెరాస పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు చేయకుండా విక్టరీ సాధించాలని వ్యూహాలు అమలుచేస్తుంది. ఇందులో భాగంగా మజ్లీస్ తో దోస్తీ లేదంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. గతంలో మజ్లీస్ తో అంటకాగిన తెరాస పార్టీ నేడు ఎందుకు దూరంగా  ఉంటుంది అంటే దానికి కారణం బీజేపీ అనే చెప్పాలి.

Asaduddin Owaisi KCR

బీజేపీ పార్టీ పూర్తిగా హిందూ అజెండా తీసుకోని ఎన్నికలకు వెళ్ళింది, బీజేపీ అంటే హిందూ పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. మజ్లీస్ అంటే ముస్లిమ్ పార్టీ అనే ముద్ర కూడా బలంగా ఉంది. గతంలో మాదిరి మజ్లీస్ పార్టీ కేవలం పాత బస్తీకి మాత్రమే పరిమితం కావటం లేదు, దేశం మొత్తం మీద తన హవా చూపిస్తూ జాతీయ పార్టీగా ఎదగటానికి పావులు కదుపుతుంది. దేశంలో ఎక్కడ ఎన్నికల జరిగిన అక్కడ ముస్లిమ్ ఓటర్లను తమవైపు తిప్పుకుంటుంది.

మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. మజ్లీస్ విషయంలో దేశంలోని ముస్లిమ్స్ అందరు ఏకం అవుతున్నప్పుడు బీజేపీ కోసం హిందువులు ఏకమైతే తప్పేంటి అనే నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకోని వెళ్తుంది. దీని మూలంగా ఇప్పుడు తెరాస పార్టీ బహిరంగంగా మజ్లీస్ తో పొత్తు పెట్టుకుంటే హిందూ ఓట్లు చీలిపోయే అవకాశం మెండుగా ఉంది. మజ్లిస్ దేశ స్థాయిలో విస్తరించే ప్రణాళికల వెనుక కేసీఆర్ ఉన్నారనేది బహిరంగరహస్యం. మజ్లిస్‌ బలంతో.. జాతీయ రాజకీయాల్లో తన బలం పెంచుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. తన సీటు కిందకే నీరు తీసుకు వస్తుంది.

telangana bjp

గత కొన్నేళ్ల నుండి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చకొడుతూ ఎన్నికల్లో విజయం సాధిస్తున్న మాట వాస్తవం, తెలంగాణ సెంటిమెంట్ ముందు మతం సెంటిమెంట్ పనికి రాదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది, కానీ ప్రజల అభిప్రాయాలూ ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు అనేది వాస్తవం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల మైండ్ సెట్ మారిపోతుందని చెప్పటానికి దుబ్బాక ఫలితాలే ఒక నిదర్శనం.

ఇక గ్రేటర్ లో బీజేపీ అధికారం చేప్పట్టే స్థాయిలో విజయం సాధించకపోయిన కానీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం మెండుగా ఉన్నాయి. అదే కనుక జరిగితే బీజేపీ విజయంలో ఖచ్చితంగా మజ్లీస్ పాత్ర ఉంటుందనేది వాస్తవం, మజ్లీస్ లో కేసీఆర్ తెరచాటు వ్యవహారమే బీజేపీకి మేలు చేస్తుందనేది కూడా వాస్తవం

Advertisement
Advertisement