కెసిఆర్ సంతోష్ బాబు కి చేసిన సహాయానికి ఆర్మీ మేజర్ ఏమన్నాడో చూడండి :

Advertisement

కెసిఆర్ సంతోష్ బాబు కి మరియు అమరులైన కుటుంబాలకు చేసిన సహాయానికి పలువురు అధికారులు, స్టార్ లు మాత్రమే కాకుండా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా కెసిఆర్ ని ఎంతగానో పొగడడం జరిగింది. ఇటీవల కాలం లో చైనా మరియు భారత్ ఏర్పరుచుకున్న మీటింగ్ లో గాల్వన్ ఘటనలో 20 మంది భారత సైనిక అధికారులు వీర మరణం పొందారు ఆ విషయం లో దేశం మొత్తం ఆ చనిపోయిన సైనిక అమరులకు సంతాపాలు తెలపడమే కాకుండా సెల్యూట్ అమరవీరూలారా అంటూ వారి రెస్పెక్ట్ ని తెలియచేసారు.

దేశం కోసం పోరాడే ఆమరవీరులకు మనం ఎం ఇచ్చిన వారు చేస్తున్న పనికి వెలకట్టలేము. గౌరవం తో చేసే సెల్యూట్ వారి కుటుంబాలకు మేము ఉన్నామని తెలిపే అండ.. ఇవి మాత్రమే మన బాధ్యత గా వారికి అందించగలము. అయితే అదే పనిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేసి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలబడి ఎంతో మంది ప్రశంశలు అందుకుంటున్నాడు. ఆయన ఇటీవల కల్నల్ సంతోష్ గారి ఇంటికి చేరుకొని నివాళులు అర్పించి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించడమే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ అండ ఎప్పటికి ఉంటుందని తెలియచేసాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ వైస్ అడ్మిరల్ ఎం ఎస్ పవర్ ఆ సహాయానికి… చనిపోయిన ఆర్మీ అధికారుల పట్ల స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయడం జరిగింది.. పవర్ కేవలం ఆర్మీ వైస్ అడ్మిరల్ మాత్రమే కాదు. చనిపోయిన సంతోష్ బాబు కి స్కూల్ మేట్ కూడా ఆ స్కూల్ లో చదువుకొని ప్రస్తుతం సైన్యం లో ఉన్న అత్యంత సీనియర్ అధికారి పవరే.. ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ కి రాసిన లేఖలో ఈ విధంగా పేర్కొన్నాడు. అమరుడైన సంతోష్ బాబు కుటుంబానికి మీరు చేసిన సహాయం అండగా ఉన్న తీరు మీ గొప్ప తనానికి నిదర్శనం. నాయకత్వ విలువలకు, మానవతీయతకు, గుండెతడికి మీరు నిలువెత్తు ప్రతీక, సైన్యం పైన మీకు సంపూర్ణ అవగాహన ఉంది.

మీ లాంటి వారు ఇచ్చే భరోసా మాలో బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఎలాంటి సాహసాన్ని అయినా చేసే ధైర్ణ్యాన్ని అందిస్తుంది. మేము చదువుకున్న సైనిక్ స్కూల్ ని ఒక సారి సందర్శించాలని కోరుకుంటూ ఆహ్వానం అందిస్తున్నాం అంటూ ఆ లేఖలో ఎంతగానో కెసిఆర్ ని పొగడడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రజల పైన వారి కష్టాల పైన ప్రభుత్వం ఎదొర్కొంటున్న సమస్యల పైన తనదైన రీతిలో అన్ని వేళల స్పందిస్తూ తెలంగాణ ప్రజల నుండే కాకుండా పలువురు ప్రముఖుల చేత శబాష్ అని అనిపించుకుంటున్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here