ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజును కలిసిన చిరంజీవి

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజును సినీ నటుడు చిరంజీవి కలిశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన్నందుకు వీర్రాజును చిరంజీవి అభినందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు. జనసేన, బీజేపీ కలిసి ఏపీ ప్రజలకు నూతన రాజకీయాన్ని పరిచయం చేయాలని చిరు వెల్లడించారు.

రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి అప్పుడప్పుడు ఇలా రాజకీయ నాయకులు కలుస్తూ ఉండటం వల్ల మళ్ళీ చిరు రాజకీయాల్లోకి వస్తాడేమోనని రాజకీయ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ప్రధాని మోదీని కూడా చిరంజీవి కలిశారు. ఇలా జనసేనకు సన్నితులను కలుస్తూ, జనసేనకు తన మద్దతును చెప్పకనే చెప్తున్నాడు. అయితే ప్రస్తుతానికి చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత సుజిత్ దర్శకత్వంలో మలయాళం మూవీ లుసిఫిర్ మూవీని రీమేక్ చేయనున్నారు. చిరు బర్త్ డే కు ఆచార్య మూవీ యొక్క ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here