Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అదే సైలెన్స్ ఎందుకు పాటిస్తున్నట్టు.?

NQ Staff - November 27, 2022 / 04:30 PM IST

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అదే సైలెన్స్ ఎందుకు పాటిస్తున్నట్టు.?

Megastar Chiranjeevi : రాజకీయాల విషయమై మెగాస్టార్ చిరంజీవి ‘వ్యూహాత్మక మౌనం’ పాటిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి వచ్చేది లేదని పదే పదే చిరంజీవి చెబుతున్నా, ‘నా తమ్ముడికి రాజకీయంగా నా మద్దతు వుంటుంది’ అని చిరంజీవి చెప్పడంలో ఆంతర్యమేంటి.?

‘మెగాస్టార్ చిరంజీవిని తరచూ కలుస్తుంటాను..’ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల చిరంజీవి ఆశీస్సులు తీసుకుని, వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

దీని భావమేమి చిరంజీవీ..

ఇంతకీ, జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనుక చిరంజీవి హస్తం వుందా.? లేదా.? ప్చ్.. మెగా కాంపౌండ్ నుంచి వ్యూహాత్మక మౌనమే వస్తోంది. ఎందుకిలా.?

వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున చిరంజీవి ప్రచారం చేస్తారన్న ఊహాగానాలైతే బలంగా వినిపిస్తున్నాయి. ఇంకో వైపు, చిరంజీవిని రాజ్యసభకు పంపాలన్న కోణంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇటీవల ఆ ప్రతిపాదన చిరంజీవి ముందుకొస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారట.

కానీ, ప్రధాని మోడీ స్వయంగా చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్నారన్నది తాజా ఊహాగానాల సారాంశం. అయినా, చిరంజీవి వ్యూహాత్మక మౌనానికే పరిమితమయ్యారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us