MLC: క‌రోనా కిట్‌లో విస్కీ బాటిల్ ప్ర‌త్య‌క్షం.. ఎమ్మేల్సీ దేవుడు అంటూ ప్ర‌శంస‌లు

MLC: క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎప్పుడు చూడ‌ని వింత‌లు విచిత్రాలు చూశాం. ఒక‌ప్పుడు సంపన్నులుగా ఉన్న‌వారు పేద‌ల‌య్యారు. మొన్న‌టి వ‌ర‌కు సెల‌బ్రిటీలుగా చెప్పుకునే వారు పొట్ట‌కూటి కోసం రోడ్డున ప‌డ్డారు. ఇక క‌రోనాతో చ‌నిపోయిన‌ప్పుడు సొంత‌వారు లేకుండానే అంత్య‌క్రియ‌ల‌ను ముగించారు. ఇలా ప్ర‌తీది చాలా విచిత్రంగా జ‌రిగింది. అయితే ఈ క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వాల‌తో పాటు స్వ‌చ్చంద సంస్ధ‌లు, సెల‌బ్రిటీలు సాయాలు చేశారు.

MLC

గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌న చాలా మంది ఆహారంతో ఇబ్బంది ప‌డ్డ‌గా నిత్యావ‌స‌ర స‌రుకులతో పాటు ఆహారం అందించారు. కాని ఈ సారి ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డ‌డంతో కాన్స‌న్‌ట్రేట‌ర్స్‌ని డినేట్ చేశారు. చిరంజీవి లాంటి వారు ఆక్సిజ‌న్ బ్యాంకులు స్థాపించి ఎందరో ప్రాణాలు కాపాడారు. ఇక కొందరు రాజ‌కీయ నాయకులైతే ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు త‌మ‌దైన స్టైల్‌లో స‌హాయ స‌హ‌కారాలు అందించారు.

మహబూబాబాద్ ఎమ్మేల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి సాయం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినవారికి కిట్‌బ్యాగులను పంపించారు. మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని జెడ్పీ, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’ అనే నినాదంతోపాటు శ్రీనివాస్‌రెడ్డి ఫొటోతో ఉన్న కిట్‌బ్యాగ్‌ను గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పంపిణీ చేశారు.

MLC

క‌రోనా కిట్ అన‌గానే అంద‌రు మాస్క్‌లు, శానిటైజ‌ర్, ఆక్సీ మీట‌ర్ ఇలా మెడిక‌ల్‌కి సంబంధించి ఏవైన ఉంటాయ‌ని అనుకున్నారు. కాని అంద‌రికి షాక్ ఇచ్చేలా కిట్‌లో టీచర్స్‌ విస్కీ బాటిల్‌ కూడా పెట్టి పంపించారు. ఇది చూసిన ప్ర‌జ‌లు అవాక్క‌వుతున్నారు. భ‌లే మంచి లీడ‌ర్‌గా, మాకు ఇలాంటి లీడ‌ర్స్ ఉంటే బాగుండు అని మందుబాబులు అనుకుంటున్నారు.

వరంగల్‌ వేయి స్తంభాల ఆలయ పునర్నిర్మాణ పనుల వేగవంతంతో పాటు రామప్ప ఆలయ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవ‌ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న నియోజ‌క వ‌ర్గంలో భారీగా అభివృద్ది కార్య్రక్ర‌మాల‌ను చేప‌డుతుండగా, ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు.