MLA Umang Singhar : నా భర్త సె క్స్‌ పిచ్చోడు.. సోనియా గాంధీకి ఎమ్మెల్యే భార్య లేఖ

NQ Staff - November 25, 2022 / 02:08 PM IST

MLA Umang Singhar : నా భర్త సె క్స్‌ పిచ్చోడు.. సోనియా గాంధీకి ఎమ్మెల్యే భార్య లేఖ

MLA Umang Singhar  : ఇప్పటికే పీకల్లోతు కష్టాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మరింతగా ఇబ్బందులు పడే విధంగా ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఒక వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ సమయంలోనే ఆ పార్టీ నాయకులు కొందరు పార్టీ యొక్క ప్రాణం తీసేలా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్ పై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేసింది.

లైంగిక వేధింపుల కేసు అతని పై పెట్టిన భార్య ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరియు రాహుల్, ప్రియాంక గాంధీ లకు లేఖలు రాసింది. ఆ లేఖలో ఉమాంగ్ పై సంచలన ఆరోపణలు చేసింది.

అతడికి మహిళలను రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేయడం అలవాటయింది. అశ్లీల వీడియోలు చిత్రీకరించి ఆడ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. గతంలో ఆయన మాజీ భార్య యొక్క వీడియోలు ఆడియోలు రికార్డ్ చేశాడు.

ఇప్పుడు నా వీడియోలు ఆడియోలు రికార్డ్ చేసి మానసికంగా వేధిస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే పై ఆయన భార్య ఆరోపణలు చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగింది. మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో ఆమె ఆరోపణలు చేయడం రాజకీయ చర్చకు తెర లేపింది.

ఆమె ఆరోపణల వెనుక బిజెపి హస్తం ఉంది అంటూ కొందరు కాంగ్రెస్‌ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర యొక్క ప్రభావం తగ్గించే విధంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉంటారు అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us