మీ తండ్రి పద్దతి బాగోలేదంటూ వైసీపీలో ఆ యువ ఎంపీని తోక్కేస్తున్నారట ?

Admin - October 24, 2020 / 06:16 PM IST

మీ తండ్రి పద్దతి బాగోలేదంటూ వైసీపీలో ఆ యువ ఎంపీని తోక్కేస్తున్నారట ?
వైసీపీ నేతల్లో అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న వారిలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకరు.    మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన ఆయన తొలి నుంచీ దూకుడుగానే ఉన్నారు.  ప్రజా సేవ తప్ప ఇంకో డైవర్షన్ తెలియని  నేతనే టాక్ ఉంది.  కుదిరితే జగన్ పేషీలోనే సమస్యలను పరిష్కరించుకోవడం లేకపోతే నేరుగా ఢిల్లీ నుండి నిధులు, అనుమతులు తెచ్చుకుని పని జరుపుకోవడం ఈయన స్పెషాలిటీ.  అందుకే ఈయనంటే నరసారావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మంచి గురి ఉంది.
ఆ గురి ఎంతలా అంటే జనం లోకల్ ఎమ్మెల్యేల దగ్గరకు కూడ పోకుండా నేరుగా ఈయన దగ్గరకే వెళ్తుంటారు.  శ్రీకృష్ణదేవరాయలు కూడ వచ్చిన వారికి వీలైనంత వరకు సహాయం చేసి పంపాలనే ధోరణిలో ఉంటారు.  ఇదే మిగతా వైసీపీ ఎమ్మెల్యేలకు నచ్చట్లేదు.  అందుకే తరచూ ఆయన మీద అధిష్టానానికి పిర్యాదులు వెళ్తుంటాయి.  ఆ పిర్యాదుల్ని మొదట్లో లైట్ తీసుకున్న హైకమాండ్  మరీ మించిపోతున్నాడనే ఉద్దేశ్యంతో ఈమధ్య ఆయన మీద కొంచెం పట్టు బిగిస్తోందని గుంటూరు జిల్లా వైసిపీలో టాక్ వినబడుతోంది.
Lobbying on Narasaraopet MP Lavu Sri Krishna Devarayalu

Lobbying on Narasaraopet MP Lavu Sri Krishna Devarayalu

ఈయన కూడ కొందరు నేతల్లాగే లొసుగులున్న ఎంపీ అయితే వాటికి అడ్డం పెట్టుకుని తొక్కిపట్టవచ్చు.  కానీ లావు వివాద రహితుడు.  అవినీతి మరకలు అసలే లేనివాడు.  అందుకే ఆయన తండ్రి విజ్ఞాన్ రత్తయ్య పేరు చెప్పి తొక్కేసే ప్రయత్నం జరుగుతోందట.  విజ్ఞాన్ రత్తయ్య చంద్రబాబు నాయుడుకు అత్యంత  సన్నిహితుడు.  బాబుగారి హయాంలోనే రత్తయ్య యొక్క విజ్ఞాన్ విద్యాసంస్థలు విశేషంగా అభివృద్ధి చెందాయి.  కుమారుడు వైసీపీలో ఎంపీగా ఉన్నా రత్తయ్య మాత్రం టీడీపీకి అనుకూలమే.
పైగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసే మేధావుల్లో ఆయన కూడ ఒకరు.  అందుకే ఆయన్ను సీన్లోకి లాక్కొచ్చారట.  తనయుడు ఎంపీగా ఉన్న పార్టీకి తండ్రి వ్యతిరేకంగా ఉండటం మంచి పద్దతి కాదని, అది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తోందని సాకులు చెప్పి శ్రీకృష్ణదేవరాయలు దూకుడుకు బ్రేకులు వేయాలని చూస్తున్నారట.  కానీ ఆ యువ ఎంపీ మాత్రం ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదన్నట్టు దూసుకెళ్లిపోతున్నారట.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us