ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ఈ రోజు మొదలైయ్యాయి. బీఏసీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇక ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీఏసీ సమావేశంలో 21 ఎజెండా అంశాలను ప్రతిపాదించిన వైఎస్ఆర్ సీపీ ప్రతిపాదించింది. టీడీపీ తరుపున 20అంశాలపై చర్చ జరగాల్సిందేనని బిఏసిలో పట్టుబట్టిన శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు
వైఎస్ఆర్ సీపీ ప్రతిపాదించిన అంశాలు
1. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి
2. గత ప్రభుత్వ తప్పిదాలు
3. ఇళ్లపట్టాల పంపిణీ- ప్రతిపక్షాల కుట్ర
4. టిడ్కో గృహాలు-వాస్తవాలు
5. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీ కరణ- ప్రతిపక్షాల కుట్ర
6. వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్లు ఏర్పాటు,
7. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం
8. కరోనా నియంత్రణ- ప్రభుత్వ చర్యలు
9. వైద్య, ఆరోగ్య రంగం- ఆరోగ్యశ్రీ
10. వ్యవసాయం ఇన్‌పుట్‌సబ్సిడీ, ఆర్బీకేలు, సున్నావడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్ఆర్ జలసిరి
11. గ్రామసచివాలయ, మైరుగైన పనితీరు
12. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ
13. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు
14. మహిళా సాధికారికత, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, సున్నావడ్డీ
15. మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు
16. సాగునీటి ప్రాజెక్ట్‌లు, రివర్స్ టెండరింగ్
18. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన
19. పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ చర్యలు
20. 9 గంటల ఉచిత విద్యుత్, ప్రభుత్వ సంస్కరణలు
21. నూతన ఇసుక విధానం
టీడీపీ ప్రతిపాదించిన అంశాలు
1. భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం – నెల్లూరులో ధాన్యం కొనుగోళ్లు
2. ఎన్ ఆర్ఈజీఎస్ బకాయిలు నిలిపివేత
3. టిడ్కో ఇళ్ల పంపిణీ – ఇళ్ల పట్టాల భూసేకరణలో అవినీతి
4. దళితులు, మైనారిటీలపై దాడులు
5. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగింపు
6. నూతన ఇసుక పాలసీ – దోపిడీ
7. నిత్యావసర ధరల పెరుగుదల – ప్రజలపై భారాలు
8. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం
9. పెరుగుతున్న నిరుద్యోగం – మూతపడుతున్న పరిశ్రమలు
10. పీపీఏల రద్దు – జీవో నెం.25
11. ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు – ప్రభుత్వ నిర్లక్ష్యం
12. మద్యం అమ్మకాలు – నాశిరకం బ్రాండ్లు
13. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల దుస్థితి– రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్, జీవో 21 రద్దు
14. సంక్షేమ పధకాలు రద్దు – సబ్ ప్లాన్ల నిర్వీర్యం
15. పెన్షన్ రెండో విడత పెంపు వైఫల్యం
16. కరోనా – సహాయ చర్యల్లో వైఫల్యం
17. పన్నులు పెంపు – ఆస్థి పన్ను
18. స్థానిక సంస్థల ఎన్నికలు
19. దేవాలయాలపై దాడులు
20. మితిమీరిన అప్పులు – దుబారా
★ తదితర అంశాలు అన్నింటిపై చర్చ జరిగేలా సభా సమావేశాలను కనీసం 10రోజుల పాటైనా నిర్వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.