టీడీపీ ని చంపేస్తున్న ఆ ‘కులం’ – చంద్రబాబు ఇంటిముందే రచ్చ రచ్చ ?
Admin - November 4, 2020 / 02:54 PM IST

ఏపీ టీడీపీ లో అధికారం నుండి తప్పుకున్నప్పటి నుండి అనేక సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇక ఈ సమస్యలను అధిగమిస్తూ వస్తున్న చంద్రబాబుకు, మరొక సమస్య వచ్చిపడింది. అయితే తాజాగా టీడీపీ రాష్ట్ర కమిటీలు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కమిటీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి బాధ్యతలు అప్పగించాడు చంద్రబాబు. అయితే అందరు అనుకున్నట్లుగానే బీసీ సామజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చాడు. ఇక ఇది ఇలా ఉంటె ఏపీలో ఒక కులం చంద్రబాబుకు చెమటలు పట్టిస్తుంది. అయితే తమ కులానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని గొగ్గోలు పెడుతున్నారు.
ఇక మొన్న ఏర్పాటు చేసిన పార్టీ పదవుల్లో మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని మాల సామజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు చంద్రబాబు ఇంటిముందే రచ్చ రచ్చ చేశారట. అయితే ఏపీ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాల, మాదిగ సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చాడు చంద్రబాబు. అయితే మాదిగ సామజిక వర్గానికి చెందిన కేఎస్ జవహర్‌కు మంత్రి పదవి ఇస్తే, అలాగే మాల వర్గానికి చెందిన పీతల సుజాతకు కూడా మంత్రి పదవి ఇచ్చాడు. ఇక అదే సమయంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను నియమించాడు.
ఇక ఎస్సీ కొర్పరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కొర్పరేషన్ చైర్మన్ పదవులను మాల సామజిక వర్గానికి చెందిన కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్ లకు కట్టబెట్టాడు చంద్రబాబు. ఇక ఇది ఇలా ఉంటె ప్రస్తుతం మొన్న ఏర్పాటు చేసిన పార్టీ పదవుల్లో మాలలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని చంద్రబాబుకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు ఆ వర్గానికి చెందిన పలువురు నాయకులు. అయితే తాజాగా ఏర్పాటు చేసిన పార్టీ పదవుల్లో జవహర్ కు రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా పగ్గాలు అప్పగించగా.. వర్ల రామయ్యకు పార్టీ పొలిట్ బ్యూరోలో అవకాశాన్ని ఇచ్చారు.
అదేవిధంగా మాదిగ వర్గానికి చెందిన ఎం.ఎస్ రాజుకు టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్ష పదవిని అంటగట్టారు. ఇక వంగలపూడి అనితకు ఏకంగా రెండు పదవులు కట్టబెట్టాడు. దీనితో మాల వర్గానికి చెందిన వారికీ ఒక్క పదవి కూడా ఇవ్వలేదని, ఆ వర్గానికి చెందిన పీతల సుజాత చంద్రబాబు ఇంటిముందే రచ్చ రచ్చ చేసిందని ఆ పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. చూడాలి మరి ఇప్పటికైనా ఆ వర్గానికి చంద్రబాబు తగిన ప్రాధాన్యత కలిగిస్తాడో లేదో అనేది.