Lakshmi Parvathi : తారకరత్న హాస్పిటల్ బిల్లు కట్టింది బాలయ్య కాదట.. ఎవరో తెలుసా..?
NQ Staff - March 3, 2023 / 12:00 PM IST

Lakshmi Parvathi : నందమూరి హీరో అయిన తారకరత్న అతి చిన్న వయసులో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంది. ఆయన యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కింద పడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
అయితే 23 రోజులు ఆస్పత్రిలో ఉన్నా కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు తుది శ్వాస విడిచారు. కాగా ఆయన ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు బాలయ్య దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఆ సమయంలో ఆయన ఆస్పత్రి బిల్లు కూడా బాలయ్య, చంద్రబాబు నాయుడు మాత్రమే భరించారంటూ వార్తలు వచ్చాయి.
లక్ష్మీ పార్వతి క్లారిటీ..
తాజాగా వాటిపై లక్ష్మీ పార్వతి స్పందించారు. తారకరత్న ఆస్పత్రి బిల్లు మొత్తం వియసాయిరెడ్డి కట్టారంటూ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తారకరత్న ఆస్పత్రి బిల్లు మొత్తం బాలయ్య కట్టారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదు. విజయసాయిరెడ్డి ఒక్కడే ఆ మొత్తాన్ని భరించారు.
చంద్రబాబు, బాలయ్య కేవలం వచ్చి పరామర్శించి వెళ్లడం మాత్రమే చేసేవారు. వారు కట్టని బిల్లును మొత్తం తామే కట్టినట్టు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నాకు అంతా తెలుసు అంటూ లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్లు చేశారు. ఆమె చేసిన కామెంట్లపై అటు టీడీపీ నుంచి ఏమైనా స్పందన వస్తుందో లేదో చూడాలి.