KTR: కాన్వాయ్‌ని ఆపి మ‌రీ, క్ష‌త్ర‌గాత్రుల‌ని కాపాడిన మంత్రి కేటీఆర్

KTR: మంత్రి కేటీఆర్ ఎప్పుడు సామాజిక సేవ‌లో ఉంటూ ఉంటారు. ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చిన కూడా వెంట‌నే స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయ‌న రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను కాపాడి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్​లోని అల్వాల్ పోలీస్​స్టేషన్ పరిధిలోని హకీంపేట వద్ద మియాపూర్​కు చెందిన పవన్, నగేష్ అనే ఇద్దరు విద్యార్థులు టూవీలర్ మీద శామీర్​పేటలో శుభకార్యానికి హాజరై తిరిగివస్తున్నారు.

ktr-shows-his-humanity2,JPG
ktr-shows-his-humanity2,JPG

ఈ క్రమంలోనే టూవీలర్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయాలతో రోడ్డుమీద పడి ఉన్నారు..అయితే అదే సమయంలో… మరో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న మంత్రి కేటీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థులను చూశారు.

వెంటనే తన కాన్వాయిని పక్కకు నిలిపి కిందికి దిగారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థులను.. తన ఎస్కార్ట్ వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను చేశారు. తన కాన్వాయ్‌కి సిబ్బందికి సూచనలిస్తూ బాధితుల్ని ఆసుప్రతికి తరలించారు..మెరుగైన చికిత్స నిమిత్తం బొల్లారంలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం రోడ్డు ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా ఆల్వాల్ తో పాటు పలు ప్రాంతాల్లో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమదాల్లో కూడా మంత్రి కేటిఆర్ తక్షణమే స్పందించిన ఘటనలు ఉన్నాయి.. రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటన విషయంలో స్పందించిన మంత్రి కేటీఆర్ మానవతా హృదయానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ktr-shows-his-humanity1
ktr-shows-his-humanity1

కేటీఆర్.. తన సోషల్ మీడియా వేదిక ద్వారా సమస్యలు తెలుసుకుంటూ ఆపదలో ఉన్న వారికి కేటీఆర్ కావాల్సిన సాయం అందిస్తున్నారు. అందునా ప్రధానంగా వైద్య సేవలు కావాల్సిన వారి విషయంలో మాత్రం తక్షణం స్పందిస్తున్నారు. కరోనా సమయంలో ఏపీ నుంచి సైతం కొందరు తమకు ఆస్పత్రుల్లో బెడ్ దొరికేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఆ వెంటనే కేటీఆర్ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డికి వారి పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని ట్వీట్ చేసారు. ద