Komatireddy Raja Gopal Reddy: ట్రిపుల్ ఆర్ కాదు.! కొత్తగా ఇంకో ‘ఆర్’ బీజేపీకి బలాన్నివ్వబోతోంది.!
NQ Staff - August 21, 2022 / 08:14 PM IST

Komatireddy Raja Gopal Reddy: రాజకీయాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ పెను సంచలనమే సృష్టిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ నటుడు యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని కేంద్ర మంత్రి అమిత్ షా హైద్రాబాద్‌లో కలవనున్న సంగతి తెలిసిందే. మునుగోడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.
ఈ సభలో ‘ఆర్ఆర్ఆర్’ పేరు మార్మోగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలుసు.. బీజేపీలోనూ ట్రిపుల్ ఆర్ వున్నారు.. అందులో ఒక ఆర్.. రాజాసింగ్ అయితే, మరొక ఆర్.. రఘునందన్ కాగా, మూడో ఆర్.. ఈటెల రాజేందర్.! ఇప్పుడిక నాలుగో ఆర్.. రాజగోపాల్ రెడ్డి..’ అంటూ వేదిక మీద పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

KomatiReddy Raja gopal Reddy officially Joins in BJP
మునుగోడులో ‘ఆర్’ ప్రభంజనమే.!
కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించగా, సభ సూపర్ సక్సెస్ అయ్యింది.
‘రాజన్న..’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద రూపొందించిన పాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ‘ఈసారి కేసీయార్‌ని మరింత గట్టిగా కొట్టబోతున్నాం..’ అంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ‘రాజగోపాల్ రెడ్డి చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలం పుంజుకుంది..’ అని బీజేపీ సీనియర్ నేతలు చెప్పుకొచ్చారు.