Kodali nani: కొడాలి నానికి క‌రోనా పాజిటివ్.. వైద్యం కోసం హైద‌రాబాద్‌కి త‌ర‌లింపు…!

Kodali nani: క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు. సినీ, క్రీడా,రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని వ‌ణికిస్తుంది. రోజుకు కనీసం ఇద్ద‌రు ముగ్గురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్‌ తేలింది. ఆయన కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

kodali nani tested corona positive
kodali nani tested corona positive

మంత్రి కొడాలి నాని ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహితులు తెలిపారు. ఇటీవల కొడాలి నానిని కలిసిన వారిలో కూడా టెన్షన్ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్‌ తేలింది. కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాలు కలిసి గత నెలలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు కాస్త తగ్గినా కోవిడ్‌ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోవిడ్‌ టచ్‌ చేసింది. సినీ పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు, హీరోయిన్లతో పాటు రాజకీయ నేతలను కూడా కోవిడ్‌ వదలడం లేదు..

kodali nani tested corona positive1,jpg
kodali nani tested corona positive1,jpg

ఇటీవ‌ల వంగవీటి రంగ వర్థంతి సభలో రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని బాంబ్‌ పేల్చిన రాధా.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడేదిలేదని ప్రకటించారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానన్నారు.