టీ‌ఆర్‌ఎస్ లో తన కూతురు కి అతిపెద్ద పీఠం ఎక్కించిన కే‌సి‌ఆర్ ? కవిత ఫుల్ హ్యాపీ ?

kavitha
kavitha

నిన్న మొన్నటి దాక తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న తెరాస పార్టీకి ఈ మధ్య జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు కొంచం ఇబ్బంది కరంగా మారిపోయాయి. కేసీఆర్ నాయకత్వంపై మెల్ల మెల్లగా వ్యతిరేకత వస్తుందనేది ఆ ఎన్నికలు నిరూపితం చేశాయి . దీనితో తెరాస వర్గాల్లో మేధోమధనం మొదలైంది. ఇందులో భాగంగా పార్టీకి దూరమైనా అనేక వర్గాలను తిరిగి తమ వైపు తిప్పుకునే విధంగా తెరాస పావులు కదుపుతుంది. అదే సమయంలో అధికారంగా కూడా అనేక మార్పులు చేర్పులు చేయటానికి కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తుంది.

kavitha

ఇందులో భాగంగా తన సీఎం కుర్చీలో కొడుకు కేటీఆర్ ను కుర్చోపెట్టాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ దానిని అమలు చేయటానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అదే విధంగా కూతురు కవిత కు కూడా పార్టీ పరంగా పెద్ద పదవిని ఇవ్వటానికి కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం ఆయన నిర్వర్తిస్తున్న తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కవితకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక రకంగా ఆమె ఇప్పటికే ఆ బాధ్యతలు తీసుకోని కార్యరంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఉద్యమ సమ‌యంలో ఉద్యోగుల నుంచి కుల సంఘాల వ‌ర‌కు అన్నింటినీ ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన కార్మిక సంఘాలు చాలా వరకు తెరాస కు దూరం అయ్యాయి. కొన్ని సంఘాల నుంచి వ‌చ్చిన త‌ల‌నొప్పుల‌తో ఆయా సంఘాల‌కు గౌర‌వాధ్యక్ష ప‌ద‌వుల నుంచి టీఆర్ఎస్ నేత‌లు త‌ప్పుకోవాల‌ని కేసీఆర్ ఆదేశించారు. అలా ఆర్టీసీ కార్మిక సంఘం నుంచి హరీష్ రావు, సింగ‌రేణి కార్మిక సంఘం నుంచి కవిత కూడా వైదొలిగారు. మిగతా నేతలు కూడా వైదొలిగారు. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాల్లో టీఆర్ఎస్ పట్టు తగ్గింది.

దీనితో ఆయా సంఘాలను తిరిగి పార్టీకి దగ్గర చేసే పనిని కవితకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇలాంటి బాధ్యతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చూసుకుంటాడు, కనుక ఆ కోణంలో ఆలోచిస్తే కవిత తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నట్లు సృష్టంగా తెలుస్తుంది. ఈ నిర్ణయం పట్ల కవిత కు ఫుల్ హ్యాపీ గానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జోష్ లో కార్మిక సంఘాలను ఏకంగా చేసి వాటి మద్దతును కూడగట్టే పనిలో పడ్డట్లు తెలుస్తుంది.

Advertisement