KCR : సీఎం కెసీఆర్ ని అవస్థ పెడుతున్న రాజకీయ శకునాలు..!!? అడ్డోస్తున్న అషాడం..!

Sravani Journalist - June 21, 2022 / 04:21 PM IST

KCR : సీఎం కెసీఆర్ ని అవస్థ పెడుతున్న రాజకీయ శకునాలు..!!? అడ్డోస్తున్న అషాడం..!

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ స్థాయిలో నేతలందరిని కలిసి రాబోయే కాలం లో ఓ కొత్త రాజకీయ ఓరవడికి శ్రీకారం చుడుతున్న అంటు సంచలనానికి తెర తీశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చాక దేశ స్థాయిలో ఆంటీ బిజెపి, అంటీ కాంగ్రెస్ నినాదాన్ని బలంగా వినిపించాలని చాలా సార్లు చెప్పారు.

అయితే అనూహ్యంగా గతవారం క్రితం వరకు జాతీయ స్థాయిలో కేసీఆర్ పెట్టే పార్టీ పేరు దగ్గర నుండి జెండా వరకు చర్చ జరిగింది.  అయితే ఇప్పుడు అంతా ఆ విషయంలో కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తుంది. కేసీఆర్ పెట్టదలుచుకున్న BRS పార్టీ ప్రకటన ఇప్పట్లో లేనట్లేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది వచ్చే ఆగస్ట్ వరకు ఆగాల్సిందే అంటున్నాయి.

పార్టీ వర్గాలు..

అయితే ఎం చేసిన ఎం చేయాలి అనుకున్న ముందుగా ముహూర్తం చూసి సమయం సందర్భంలో చేసే ముఖ్యమంత్రి కి ప్రస్తుతం ప్రధాన అడ్డంకి ఆషాఢ మాసం అని తెలుస్తుంది . మంచి ముహూర్తాలు ముగిసే ఈ నెల 30 నుండి ఆషాడం షురూ కానుంది . ఒకవేళ ఈలోగా ప్రకటన చేయాలి అనుకున్న అది అసాధ్యమే. ఎందుకంటే జాతీయ స్థాయిలో కేసీఆర్ చేపట్టదలచిన ఇంకా అనేక పనులు పూర్తి కాలేదని అందుకే కేసీఆర్ చేసే కసరత్తు కొనసాగుతుంది అని చెప్తున్నారు పార్టీ నేతలు! ఇక ఓ పక్క రాష్ట్రపతి ఎన్నికలు మరోపక్క దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అగ్నిపథ్ నిరసన వల్ల జరగాల్సిన చర్చలు నిలిచి పోయినట్లు సమాచారం..!

KCR waiting For Better Moments for BRS Party

KCR waiting For Better Moments for BRS Party

వ్యవసాయము , జలం, విద్యుత్ విధానాలపై వచ్చే నెల విస్తృత చర్చ చేయనున్నారట. ముందుగా ఆషాడ మాసంలోగానే పార్టీని ప్రకటించి తర్వాత విధి విధానాలు ప్రకటించవచ్చనీ పార్టీ నేతలు అంటున్న అంతా తొందరగా అయ్యే పని కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సాధారణ ఎన్నికల హడావుడి షురూ కానున్నది అని రెండేండ్ల సమయం కూడా లేదు ఇంకా ఆలశ్యమైతే నష్టమే అని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి.

ఆలస్యం అయినా సరే సమయ సందర్భం చూసి ఢిల్లీలో పార్టీ ని బహిరంగ సభ ద్వారా ప్రకటించాలని కేసీఆర్ ఆకాంక్ష అని దానికి అనుగుణంగానే కార్యాచరణ కూడా అవుతుంది అని తెలుస్తుంది. సో ఇలాంటి ప్లాన్స్ వున్నపుడు జాతీయ స్థాయిలో తీసుకురాబోయే పార్టీ ప్రకటన ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అంచనా ! సో ఈ మొత్తం ఇష్యూ పై కేసీఆర్ ఏం చెప్తారనేదానిపై పార్టీ వర్గాల్లో ,ఇతర పార్టీలో ఉత్కంఠ అయితే నెలకొంది

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us