PM Narendra Modi And KTR : ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌లో ప్రోటోకాల్ రగడ : కేటీయార్ ‘స్ట్రాంగ్’ రిప్లై.!

NQ Staff - August 5, 2022 / 07:21 PM IST

149535PM  Narendra Modi And KTR  : ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌లో ప్రోటోకాల్ రగడ : కేటీయార్ ‘స్ట్రాంగ్’ రిప్లై.!

PM Narendra Modi And KTR  : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రోటోకాల్ పాటించలేదన్న విమర్శ వుంది. ఈ విషయమై బీజేపీ నేతలు పదే పదే కేసీయార్ మీద విమర్శలు చేస్తుంటారు.

ఓ జర్నలిస్టు తాజాగా ఈ విషయమై తెలంగాణ మంత్రి కేటీయార్‌ని ప్రశ్నించారు. ‘ఆరు నెలల్లో మూడు సార్లు కేసీయార్ ప్రోటోకాల్ విస్మరించారు. ప్రధాని మోడీకి తెలంగాణలో స్వాగతం పలకలేదు.. దేశ ప్రధాని కంటే తెలంగాణ ముఖ్యమంత్రి గొప్పా.?’ అంటూ షని మిశ్రా అనే ఓ జర్నలిస్టు ‘ఆస్క్ కేటీయార్’ ద్వారా ప్రశ్నించడం జరిగింది.

ప్రధాని ప్రైవేటు పర్యటనలకు.. సీఎం వెళ్ళాల్సిన పనిలేదు..

KCR Did Not welcome PM Narendra Modi in Telangana KTR Answer Netizans Question

KCR Did Not welcome PM Narendra Modi in Telangana KTR Answer Netizans Question

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రైవేటు పర్యటనలు చేసినప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా స్వాగతం పలకాలన్న రూల్ లేదు.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీయార్ స్పష్టంగా చెప్పారు. ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించడం జరుగుతుందని అన్నారాయన.

మరోపక్క, జాతీయ జెండాని ప్రొఫైల్ పిక్ (డీపీ)లో పెడితే జీడీపీ పెరుగుతుందా.? అంటూ ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు కేటీయార్ తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు. డీపీలు మార్చడం మీదున్న శ్రద్ధ జీడీపీ విషయంలో ప్రధాని మోడీకి లేదనే అర్థం వచ్చేలా ఆన్సర్ ఇచ్చారు కేటీయార్.
కాగా, ‘హిందీ ఇంపోజిషన్’ని తాము సమర్థించబోమని కేటీయార్, ‘హిందీలో సమాధానమివ్వాలి’ అంటూ వచ్చిన ట్వీటుపై స్పందించారు.