ప్రధాని పర్యటనలో కేసీఆర్ దక్కని చోటు.. ప్రకంపనలు రేపుతున్న మోడీ నిర్ణయం

ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నా సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో అనేక విమర్శలకు దారి తీస్తున్నాయి, ప్రోటోకాల్ లో భాగంగా దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతలు స్వాగతం పలికి ఆ కార్యక్రమంలో భాగంగా కావటం జరుగుతుంది, కానీ నేడు రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనే సీఎం కేసీఆర్ కు అవకాశం లేదని, ఆయన రావాల్సిన అవసరం లేదని పీఎంఓ కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చిందని తెరాస వర్గాలు చెపుతున్నాయి.

cm kcr pm modi

భారత్‌ బయోటెక్‌ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై సమీక్షకు మోదీ శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే! ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాన మంత్రి ఏదైనా రాష్ట్రానికి వెళ్లినపుడు విమానాశ్రయం వద్ద్ద గవర్నర్‌, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈసారీ అలాగే చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)కు సమాచారం ఇచ్చిందని వివరించారు.

అయితే, మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చిందని ఇందులో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతామొహంతి, సైబరాబాద్‌ సీపీ వీసీ సీజ్జనార్‌, హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కమాండెంట్ కు మాత్రమే అవకాశం ఇస్తున్నట్లు కాబట్టి సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

పీఎంఓ కార్యాలయం నుండి ఇలాంటి సమాచారం రావటంతో ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు, సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంఓ నుండి సమాచారం రావటం ఇదే మొదటిసారి అంటూ ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేశారో..? లేక గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలా చేసారో అర్ధం కావటం లేదని తెరాస వర్గాలు అంటున్నాయి

Advertisement