KCR : కేసీయార్ ‘బీఆర్ఎస్’ పార్టీ ప్రకటన.! ఎమ్మెల్సీ కవితను దూరం పెట్టారా.?

NQ Staff - October 5, 2022 / 09:49 PM IST

KCR  : కేసీయార్ ‘బీఆర్ఎస్’ పార్టీ ప్రకటన.! ఎమ్మెల్సీ కవితను దూరం పెట్టారా.?

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘భారత్ రాష్ట్ర సమితి’గా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరుని మార్చుతూ కాస్సేపటి క్రితం ప్రకటన చేసిన విషయం విదితమే.

తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతల సమక్షంలో కేసీయార్ ఈ ప్రకటన చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూరంగా వున్నారు. కేసీయార్ కుమార్తె, పైగా ఎమ్మెల్సీ కూడా అయిన కవిత ఎందుకు, ‘బీఆర్ఎస్’ ప్రకటన సమయంలో కనిపించలేదు.?

కావాలనే దూరం పెట్టారట..

భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన సమయంలో కవితను దూరంగా వుండాలని ముఖ్యమంత్రి కేసీయార్ ఆదేశించారనే గాసిప్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, గులాబీ శ్రేణులు మాత్రం ఈ విషయమై పెదవి విప్పడంలేదు.

కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే, తెలంగాణలో బీఆర్ఎస్ బాధ్యతలు ఎవరు చేపట్టాలన్నదానిపై కేటీయార్, కవిత, హరీష్ రావు మధ్య రచ్చ జరిగే అవకాశాల్లేకపోలేదు.
ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతానికైతే కవిత గైర్హాజరీ విషయమై గులాబీ శ్రేణుల్లోనూ కొంత అయోమయం కనిపిస్తోంది.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us