Kcr and Jagan Meet: ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పెళ్ళిలో సందడి

Kcr and Jagan Meet:  తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్ళికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పలు రకాల వివాదాల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరూ ఓకే వేదికపై కలుసుకున్నారు.

TheNewsQube-
KCR and Jagan Meet in Marriage at Hyderabad2
KCR and Jagan Meet in Marriage at Hyderabad2

వివాహం అనంతరం చాలాసేపు కూర్చుని ముచ్చటించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్ళి వేడుక శంషాబాద్ కొత్తగూడలో ఉన్న వీఎన్ఆర్ ఫామ్స్ లో ఈరోజు అంగరంగ వైభవంగా స్నిగ్దారెడ్డి పెళ్ళి జరిగింది.

KCR and Jagan Meet in Marriage at Hyderabad
KCR and Jagan Meet in Marriage at Hyderabad

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రత్యేక అధికారిగా వర్క్ చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో స్నిగ్థారెడ్డి ని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్ళి వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటుగా స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిలు అటెండ్ అయ్యారు.

KCR and Jagan Meet in Marriage at Hyderabad2
KCR and Jagan Meet in Marriage at Hyderabad2

ఈ వివాహ వేడుకకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. వీరి పెళ్ళికి వైఎస్ విజయలక్ష్మీ కూడా రావడం మరో హైలెట్ గా నిలిచింది.

ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివాహ వేడుకకు వచ్చి సందడి చేయడంతో ఈ పెళ్ళి ఫోటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.