CM KCR: పోటీచేయడానికి భయపడుతున్న కేసీఆర్.. ఇదేమి ఖర్మరా దేవుడా.. !

cm kcr
cm kcr

CM KCR తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన తెరాస పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి. చేతిలో అధికారం ఉన్నకాని ఎన్నికల్లో పోటీచేయడానికి కింద మీద పడుతుంది ఆ పార్టీ. ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయి పరువు పోకొట్టుకోవటం కంటే ముందుగానే అసలు ఎన్నికలకు దూరంగా ఉండటమే నయం అనుకునే ఆలోచనలో తెరాస ఉన్నట్లు తెలుస్తుంది.

MLC elections

తెలంగాణలో త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగలసి ఉంది. ఒక దానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు. మరో దాని ఊసు ఎత్తలేదు. అక్కడ పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. వరంగల్ ఖమ్మం, నల్గొండ స్థానానికి పల్లా రాజేశ్వరరెడ్డిని కేసీఆర్ బరిలోకి దించారు. ఆయన ప్రచారం కూడా ఉధృతంగా చేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు టిక్కెట్ ఖరారు చేశారు. కానీ ఆయన తన వల్ల కాదని చేతులెత్తేశారు. తర్వాత గతంలో ఓడిపోయిన దేవీ ప్రసాద్‌ని పిలిచారు. ఓ సారి ఓడించింది చాలని ఆయన సైలెంటయ్యారు.

హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం అంటే తెరాస కు చాలా భయం, ఎందుకంటే ఈ స్థానంలో తెరాస పార్టీ ఎప్పుడు గెలించింది లేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా సమయంలో కావచ్చు, ఆ తర్వాత సొంత రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా కావచ్చు, ఇక్కడ తెరాస ను పరాభవం తప్ప విజయం దక్కలేదు. 2015లో ఎంతో నమ్మకంతో టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడుగా ఉన్న దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి బరిలోకి దింపారు. ఆయన కూడా ఓటమి పాలయ్యాడు.

2018 లో ముందస్తు ఎన్నికలు జరిగిన తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన జీవన్ రెడ్డి అనూహ్య విజయం సాధించారు. నిజానికి 2018 ఎన్నికల్లో తెరాస విజయం సాధించి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి హవా నడుస్తున్న సమయంలో కూడా ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని తెరాస కోల్పోవటం జరిగింది. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైన నేపథ్యంలో పోటీకి దిగి పరువు తీసుకోవటం ఎందుకు అనే మాటలు తెరాస వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఫిబ్రవరి 23 వ వరకే నామినేషన్స్ వేయటానికి చివరి తేదీ, అయినా కానీ ఇప్పటివరకు దానిని సంబంధించిన ఊసే లేదు.. దీనిని బట్టి చూస్తే పోటీచేయడానికి తెరాస భయపడుతున్నట్లే అని అర్ధం అవుతుంది. -+-

Advertisement