బిగ్ బ్రేకింగ్ : హై కోర్టుకి కత్తి కార్తీక.. ఒక్కక్కడికీ చెమటలు పడుతున్నాయి?

Admin - November 5, 2020 / 12:53 PM IST

బిగ్ బ్రేకింగ్ : హై కోర్టుకి కత్తి కార్తీక.. ఒక్కక్కడికీ చెమటలు పడుతున్నాయి?

దుబ్బాక ఉపఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. అయితే ప్రధానంగా అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉందని అందరికి తెలిసిందే. అయితే నేను దుబ్బాకలో మంచి పోటీ ఇచ్చానాని, నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక. అయితే దుబ్బాకలో కత్తి కార్తీక పోటీ చేయడానికి గల కారణం అధికార పార్టీనే కావాలని ఆమెను బరిలోకి దింపింది అని అందరికి అనుమానం వ్యక్తం అయింది. కానీ ఆమె మాత్రం ఈ మాటలకూ స్పందిస్తూ.. రాష్ట్రంలో దొరల పాలనా నడుస్తుందని విరుచుకుపడింది కార్తీక. అంతేకాదు ఆమె దుబ్బాక ఉపఎన్నిక బరిలో నుండి తప్పుకోవాలని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసేవారని చెప్పుకొచ్చింది.

karthika

అలాగే కొంతమంది అయితే ఫోన్లు చేసి డబ్బులు ఎంత కావాలని అడిగేవారని తెలిపింది. మరికొందరు అయితే పోటీ నుండి తప్పుకోవాలని బయపెట్టేవారని చెప్పింది. ఇక ఈ ప్రలోభాలకు లొంగడం లేదని నేను ఉండే ఇంట్లోకి ఏకంగా పాములను కూడా వదిలారని చెప్పుకొచ్చింది. కానీ కత్తి కార్తీక ఎలాంటి వాటికి భయపడదని పేర్కొంది. నేను గౌడ జాతికి చెందిన వ్యక్తినని, వంద అడుగుల తాటి చెట్టు ఎక్కే గౌడ జాతిలో పుట్టిన నాకు భయం లేదని తెలిపింది.

karthika 2

అలాగే ఈ ఎన్నికల్లో నన్ను అనేక విధాలుగా భయాందోళనకు గురి చేయాలనీ ప్రయత్నించిన వారికీ బుద్ది చెపుతానని పేర్కొంది. అంతేకాదు వారిపై హై కోర్ట్ కు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉందంట కార్తీక. ఇక ఒకవేళ ఆమె చెప్పినట్లు కోర్ట్ మెట్లెక్కితే, ఆమెను భయపెట్టిన వారికి చెమటలు పెట్టడం ఖాయమని చెప్పాలి. దుబ్బాక ఎన్నికలు ముగిసిన కూడా మాల్లో యవ్వారం ముంగటేసుకోబోయే సరికి చర్చనీయాంశంగా మారింది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us