కర్ణాటక బీజేపీ మంత్రి రాసలీలలు లీక్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో

లీలలందు రాసలీలలు వేరయా.. ! విశ్వదామి రామ ఎవరికీ కనిపించకు మామ అనేది సరదాగా చెప్పుకునే ఒక పద్యం.. కానీ పద్యం సరదాగానే ఉండవచ్చు కానీ, ఆ సంఘటనలు బయట పడినప్పుడు జరిగే ప్రకంపనలు మాత్రం దారుణంగా ఉంటాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఒక మంత్రి యొక్క రాసకేళి సీడీ బయటకు వచ్చి కర్ణాటకలో కల్లోలం సృష్టిస్తుంది.

Ramesh-Jarkholi

జలవనరులశాఖ మంత్రి రమేశ్‌ జార్కిహొళికి సంబంధించిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్‌ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ఎక్కడ, ఎవరు తీశారనేది స్పష్టత లేదు.

మరోవైపు ఆ యువతే కావాలని ఓకే పథకం ప్రకారం ఈ వీడియోస్ రికార్డు చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని దానికి కావాల్సిన ఫండింగ్ కోసం మంత్రికి దగ్గర అయ్యిందనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. కర్ణాటక శాసనసభ సమావేశాలు మరో రెండు రోజుల్లో మొదలవుతున్నాయి. అలాగే, రమేశ్‌ జార్కిహోళి అడ్డా బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్నాయి. ఈ తరుణంలో లీక్‌ అయిన శృంగార సీడీ వ్యవహారం రాజకీయరంగు పులుముకొంటోంది. మంత్రి రాసలీలల వ్యవహారం ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. సభలో ఈ వ్యవహారంపై సర్కారును ఇరుకునపెట్టడానికి అవి సిద్ధమవుతున్నాయి.

నిజానికి రమేశ్‌ జార్కిహోళి మొదట కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండేవాడు, కానీ అక్కడ కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకించి బీజేపీ లోకి చేరాడు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు జెండా ఎగరవేయించి, శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి పక్కాగా పావులు కదిపారు. అలాంటి నేత వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసింది. అయితే ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆ మంత్రితో రాజీనామా చేపించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement