Kamala-Harris: అమెరికా అధ్య‌క్షురాలిగా క‌మ‌ల్ హ్యారిస్.. ఎందుకిలా?

Kamala-Harris: ఇటీవ‌ల అమెరికా ప్రెసిడెంట్ బాధ్య‌త‌ల‌ను అందుకున్న జో బిడెన్ తన అధికారాలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించారు. ఇది తాత్కాలికం మాత్రేమ‌. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం.

TheNewsQube-
Kamala-Harris to be amrica presdient
Kamala-Harris to be amrica presdient

అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్‌ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్‌ శివారులోని వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతలు నిర్వహించే పరిస్థితిలో లేకపోతే తన అధికారాలను మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధంగానే ఆ కొంత సమయం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్ కొనసాగారు. ఇదే తరహాలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు.

బైడెన్‌కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్‌ వైట్‌హౌస్‌ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది.

పరీక్షల అనంతరం బైడెన్‌ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి. ఇటీవల అధ్యక్షుడు జో బిడెన్, కమలా హారిస్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఇది కాకుండా హారిస్ రేటింగ్ కూడా గత నెలల్లో బిడెన్ కంటే ఎక్కువగా పడిపోయింది.

Kamala-Harris to be amrica presdient2
Kamala-Harris to be amrica presdient2

ఇలాంటి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవి నుంచి హ్యారీస్‌ను తప్పించవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. దీని కోసం బిడెన్ బ్యాక్‌డోర్ మార్గాన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని విషయాలలో కమలా హారిస్, ఆమె సహాయకులు అధ్యక్షుడిపై కోపంగా ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు CNNకి తెలిపాయి. అయితే వీటికి ఎటువంటి ఆధారాలు మాత్రం లేవు.