KA Paul : బీజేపీ, ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివెనుక ప్రధాని మోదీ, అమిత్ షా వ్యూహం ఏంటన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం ప్రధానంగా కనిపిస్తోందని కొందరు చర్చించుకుంటున్నారు.
పాల్ ఆసక్తికర కామెంట్స్..
ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా నామినేట్ చేసింది బీజేపీ. ఇప్పుడు గిరిజన ఆదివాసి తెగకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. ముర్ము గెలుపు ఖాయమా లేదా అనే దానిపై ఇప్పుడు విస్తృత చర్చలు నడుస్తున్నాయి.

అయితే ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయాలని తానే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశానన్నారు. అలాగే వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వద్దని కూడా తానే చెప్పానని బాంబు పేల్చారు. తన ఒరియా సోదరి రాష్ట్రపతి అవుతుండటం సంతోషంగా ఉందన్నారు కేఏ పాల్.ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావాలని భగవంతుడిని ప్రార్థించానన్నారు. దేవుడికి తాను ఎంతో రుణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు కేఏ పాల్. దేశ చరిత్రలో తొలిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతుండటం దేశానికే గర్వకారణం అన్నారు కేఏ పాల్.

నేను వద్దన్న వెంకయ్య నాయుడిని ప్రెసిడెంట్ చెయ్యలేదు. నేను రిక్వెస్ట్ చేసిన నా ఒరియా సోదరిని ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. మొన్ననే నేను మీకు హింట్ ఇచ్చాను. రాష్ట్రపతిగా మహిళను చేస్తారని చెప్పాను. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయ్యి తీరుతుందని మీకు లాస్ట్ వీక్ లోనే చెప్పా. ఈవిడను రాష్ట్రపతిని చెయ్యాలని దేవుడిని ప్రార్థించాను.
- Advertisement -
దేవుడి నా మొర విన్నాడు. ఆమెను రాష్ట్రపతిని చేసినందుకు నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఆవిడ చాలా క్లీన్ ఉమెన్. గవర్నర్ గా తన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుంది. పైగా ఆమె నా ఒరియా సోదరి” అని కేఏ పాల్ అన్నారు. ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం ఉజ్జ్వలంగానే సాగినా.. వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. ముర్ము భర్త శ్యాంచరణ్ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే, ద్రౌపది భర్త శ్యాంచరణ్ తోపాటు ఇద్దరు కుమారులు గతంలోనే చనిపోయారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది.