Hemant Soren : ముఖ్యమంత్రి శాసన సభ సభ్యత్వం రద్దు.! గవర్నర్ సంచలన నిర్ణయం.!
NQ Staff - August 26, 2022 / 09:40 PM IST

Hemant Soren : ఓ ముఖ్యమంత్రి శాసన సభ సభ్యత్వం రద్దయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో, రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనమిది. ఈ సంఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు.! జార్ఖండ్ రాష్ట్రంలో.

Jharkhand Governor Likely To Decide On ‘Disqualification’ Of CM Hemant Soren As MLA Today
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేశారనీ, ప్రభుత్వం ద్వారా తనకే గనులు దక్కేలా చేసుకున్నారనీ అభియోగాలు వచ్చాయి. ఈ అభియోగాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి శాసన సభ సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌కి సిఫార్సు చేసింది.
హేమంత్ సోరెన్ ఇప్పుడేం చేస్తారు.?
హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దవడంతో, ఇప్పుడాయన ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ‘ఇది రాజకీయ కుట్ర..’ అని ఆరోపిస్తున్నారాయన. న్యాయపోరాటం చేస్తానంటున్నారు. శాసన సభ లేదా శాసన మండలిలో సభ్యత్వం లేకపోతే, ముఖ్యమంత్రి పదవిలో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగడానికి వుండదు.
ఆరు నెలల్లోపే శాసన సభ లేదా శాసన మండలిలో సభ్యత్వం పొంది వుంటేనే, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి వీలుంటుంది. మరి, వున్నపళంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి తమ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఆయన పోటీ చేసి, శాసనసభకు మళ్ళీ ఎంపికై ముఖ్యమంత్రి పదవిని హేమంత్ సోరెన్ కాపాడుకుంటారా.? అన్నది వేచి చూడాలి.