Hemant Soren : బిగ్ బ్రేకింగ్: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనస సభ సభ్యత్వం రద్దు.!

NQ Staff - August 25, 2022 / 07:39 PM IST

Hemant Soren : బిగ్ బ్రేకింగ్: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనస సభ సభ్యత్వం రద్దు.!

Hemant Soren : రాజకీయాల్లో అనూహ్యమైన ఘటనలకు కొదవేమీ వుండదు. అయితే, ఈ మధ్య అలాంటి అరుదైన సంఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కి సమాచారం పంపింది.

Jharkhand CM Hemant Soren Legislative Assembly has been canceled

Jharkhand CM Hemant Soren Legislative Assembly has been canceled

శాసన సభ సభ్యత్వం రద్దయితే, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అవకాశం వుండదు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో షాక్ తిన్న హేమంత్ సోరెన్, సాయంత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవబోతున్నారట. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌లోనే అధికారిక పర్యటనలో వున్నారు.

హేమంత్ సోరెన్.. వాట్ నెక్సట్.?

హేమంత్ సోరెన్.. తనకు తానే మైనింగ్ లీజుని కేటాయించుకున్నందున శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం సమాచారమిచ్చింది.

గత కొంతకాలంగా హేమంత్ సోరెన్, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినదిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలంటూ హేమంత్ సోరెన్ మద్దతుదారులు నినదిస్తున్నారు.

కాగా, శాసన సభ సభ్యత్వం రద్దయిన దరిమిలా, హేమంత్ సోరెన్ తదుపరి రాజకీయ యెత్తుగడ ఎలా వుండబోతోందో వేచి చూడాల్సిందే.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us