Janasenani : భారీ విరాళాల పై దృష్టి పెట్టిన జనసేనాని

NQ Staff - September 23, 2022 / 02:54 PM IST

160297Janasenani : భారీ విరాళాల పై దృష్టి పెట్టిన జనసేనాని

Janasenani : ఈ మధ్య కాలంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా భారీగా విరాళాలను సేకరించడం మనం చూస్తూనే ఉన్నాం, ఒకవేళ విరాళాలు రాకపోతే పార్టీ మనుగడ కష్టం. అధికారంలో లేని పార్టీకి విరాళాలు అందడం అనేది కాస్త ఇబ్బందికర విషయమే. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం, తప్పకుండా ఆ సమయంలో మీకు అందుబాటులో ఉంటాం అన్నట్లుగా కొందరిని మచ్చిక చేసుకుని మరీ విరాళాలు సేకరించాల్సి ఉంటుంది.

Janasenani Concentration on Donations

Janasenani Concentration on Donations

ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ అదే పనిలో పడ్డట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్నాడు, అక్కడ జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అంతే కాకుండా అక్కడ స్థానికుల నుండి భారీ ఎత్తున విరాళాలను సేకరించుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది.

అమెరికన్ డాలర్లను జనసేన వచ్చే ఎన్నికల ప్రచారం కోసం వినియోగించేందుకు గాను పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లాడని సమాచారం అందుతుంది. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో విరాళాలతో తిరిగి ఇండియాకు చేరుకోబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లడంతో అక్కడ ఎన్నారైలు పెద్ద మొత్తంలో జనసేనకు విరాళాలుగా అందించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అధికారంలోకి వస్తామనే నమ్మకం కలిగించేందుకు పవన్ కళ్యాణ్ మరియు జనసేన నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, అతి త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అందుకు భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

అందుకే ఈ విరాళాల సేకరణ జరుగుతుందని సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికల సమయంలో కూడా కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాలని జనసేన పార్టీ భావిస్తున్నారు. అందుకే విరాళాల సేకరణ కోసం అమెరికా వరకు జనసేనాని వెళ్ళాడు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.