Janasena : వైసీపీ పార్టీ గుర్తుని మార్చేస్తారా.? జనసేన ఉచిత సలహా ఏంటంటే.!

NQ Staff - September 27, 2022 / 08:47 AM IST

Janasena : వైసీపీ పార్టీ గుర్తుని మార్చేస్తారా.? జనసేన ఉచిత సలహా ఏంటంటే.!

Janasena : జనసేన పార్టీ గత కొంతకాలంగా వైసీపీ మీద సోషల్ మీడియా వేదికగా ఘాటైన సెటైర్లు వేస్తున్న విషయం విదితమే. ఈ సెటైర్ల స్థాయి వేరే లెవల్‌కి వెళ్ళిందిప్పుడు. ఏకంగా వైసీపీ ఎన్నికల గుర్తునే మార్చెయ్యాలని ఉచిత సలహా ఇచ్చింది జనసేన పార్టీ తన కార్టూన్ ద్వారా. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నుంచి వైసీపీ మీద వస్తున్న కార్టూన్లన్నింటిలోనూ హెలికాప్టర్ కంపల్సరీగా వుంటోంది.

ముఖ్యమంత్రి అసలు నేల మీద పరిస్థితులు చూడటంలేదు, అంతా గాల్లో పర్యటనలతోనే సరిపెడుతున్నారన్నది జనసేన ఉద్దేశ్యం.
పార్టీ గుర్తు ఎవరు మార్చుకోవాలి.? జనసేన పార్టీకి గత ఎన్నికల్లో గ్లాసు గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే, గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేన చోటు సంపాదించుకునేందుకు నానా తంటాలూ పడుతోంది. తెలంగాణలో అయితే, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గల్లంతయినట్లుగా గతంలో ప్రచారం జరిగింది.

తమ గుర్తు విషయమై, తమ పార్టీ గుర్తింపు విషయమై తీవ్ర అయోమయంలో వున్న జనసేన పార్టీ, వైసీపీ ఎన్నికల గుర్తు మీద సెటైర్ వేయడమేంటి.? ఫ్యాను గుర్తుని మార్చేసి హెలికాప్టర్ గుర్తుని ఎంచుకోవాలనడమేంటి.? అని సోసల్ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు. అయితే, జనసేన పార్టీకి వున్న సినీ అభిమానుల బలం నేపథ్యంలో.. ఇప్పుడీ గుర్తు మార్పు అంశం జనంలోకి బలంగా వెళ్ళిపోతోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us