Janasena : ఇప్పటం నిర్వాసితులకు జనసేనాని ఆపన్నహస్తం

NQ Staff - November 8, 2022 / 01:08 PM IST

Janasena : ఇప్పటం నిర్వాసితులకు జనసేనాని ఆపన్నహస్తం

Janasena : జనసేన పార్టీ మీటింగ్ కు స్థలంను ఇచ్చిన ఇప్పటం గ్రామ ప్రజలపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టిందంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఆ కక్ష తోనే ఇప్పటం గ్రామంలోని చాలా ఇళ్లను నేలమట్టం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం వెళ్లి మరీ ఇళ్లు కోల్పోయిన వారికి మద్దతుగా నిలిచారు. తాజాగా వారికి ఆపన్నహస్తం అందించేందుకు జనసేనాని సిద్ధం అయ్యారు. ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయల చొప్పున తక్షణ సాయంను అందిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు.

ఇప్పటంలో ప్రజలు జనసేనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి మనోధైర్యం కలిగించిన జనసేనాని ఇప్పుడు ఆర్థక సాయం చేయడం శుభపరిణామం అంటూ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం పై ఈ విషయమై తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడం ద్వారా గొప్ప వ్యక్తిగా నిలిచాడు అంటూ అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Janasena president Pawan Kalyan help Ippatam villagers

Janasena president Pawan Kalyan help Ippatam villagers

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us