Janasena Party : రాష్ట్రంలో రౌడీలందరికీ బాస్ ముఖ్యమంత్రే: వైఎస్ జగన్‌పై జనసేన సెటైర్.!

NQ Staff - November 21, 2022 / 06:43 PM IST

Janasena Party : రాష్ట్రంలో రౌడీలందరికీ బాస్ ముఖ్యమంత్రే: వైఎస్ జగన్‌పై జనసేన సెటైర్.!

Janasena Party : ‘అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి వచ్చిందెవరు.? డ్రైవర్‌ని చంపేసిన ఎమ్మెల్సీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి.? బూతులు తిడుతున్న మంత్రులు ఏ పార్టీకి చెందినవారు.?’ అంటూ జనసేన పార్టీకి చెందిన నేతలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

నర్సాపురం పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన పార్టీని ‘రౌడీ సేన’గా అభివర్ణించిన విషయం విదితమే. ఈ విషయమై జనసేన నుంచి కౌంటర్ ఎటాక్ చాలా తీవ్రమైన స్థాయిలో వస్తోంది.

దొంగలా తిరుగుతున్న జగన్.. ధైర్యంగా తిరుగుతున్న పవన్..

పరదాల చాటున.. బారికేడ్లు అడ్డం పెట్టుకుని.. దొంగలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుగుతున్నారంటూ జనసేన నేతలు పంతం నానాజీ, అర్హం ఖాన్, షేక్ రియాజ్ తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధైర్యంగా ప్రజలకు అబివాదం చేస్తూ వెళుతున్నారు.. ప్రధాని సైతం ప్రజల్లోకి వెళుతున్నారు.. ముఖ్యమంత్రి మాత్రం.. భయపడుతూ వెళుతున్నారు..’ అని ఎద్దేవా చేశారు జనసేన నేతలు.

‘మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, పార్టీలో అడ్డుగా వున్నాడని చౌలూరి రామకృష్ణారెడ్డిని హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఇక్బాల్, విలేకరిని చంపించిన కేసులో మంత్రి దాడిశెట్టి రాజా, గుడ్డలు విప్పుకుని అసభ్యంగా ప్రవర్తించే ఎంపీ గోరంట్ల మాధవ్ వున్నది వైసీపీలోనే..’ అంటూ వైసీపీ చిట్టా విప్పారు జనసేన నేతలు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us