Janasena : జిప్పు విప్పి చూపితే మూగబోయిన నోళ్ళు.. చెప్పు చూపిస్తే తెరచుకున్నాయేం.?
NQ Staff - October 20, 2022 / 10:45 AM IST

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో ఇంకా కొనసాగుతూనే వున్నాయి. విశాఖలో హంగామా, ఆ తర్వాత మంగళగిరిలో హంగామా.. వెరసి, జనసేన పార్టీకి జస్ట్ రెండు మూడు రోజుల్లోనే విపరీతమైన పొలిటికల్ మైలేజీ ఏపీలో వచ్చిందన్నది నిర్వివాదాంశం. వైసీపీ నేతలంతా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు ఒకరికి మించి ఇంకొకరు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ, అధినేత వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.
జనసేన నేతలూ తక్కువేం తిన్లేదు.. ఈ సదవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదనుకుంటున్నారు జనసేన నేతలు. నిన్నమొన్నటిదాకా అస్సలేమాత్రం యాక్టివ్‌గా లేని జనసేన నేతలు చాలామంది అనూహ్యంగా తెరపైకొస్తున్నారు. మంత్రుల మీద చెలరేగిపోతున్నారు.. ఎమ్మెల్యేలనూ తూలనాడుతున్నారు. ఆ మాటా.. ఈ మాటా అని తేడాల్లేవ్.. ఎడా పెడా తిట్టేసుకుంటున్నారంతే వైసీపీ వర్సెస్ జనసేన నేతలు. బూతులు ఓ ప్రవాహం.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
జనసేన నేత కిరణ్ రాయల్ అయితే, కొన్నాళ్ళ క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ‘మీ ఎంపీ జిప్పు విప్పి చూపిస్తే లేవని నోళ్ళు.. పవన్ కళ్యాణ్ చెప్పు చూస్తే ఎందుకు లేస్తున్నాయ్.?’ అంటూ ప్రశ్నించడం సంచలనంగా మారింది. ‘యుద్ధం’ అంటే రాజకీయం అని.. అంతేగానీ, సంజన.. సుకన్యలతో చేసిది కాదంటూ అంబటి రాంబాబుపై ప్రత్యేకంగా సెటైర్లేశారు కిరణ్ రాయల్.