Pawan Kalyan And Chandrababu Naidu : చంద్రబాబుతో పవన్ భేటీ..
NQ Staff - January 8, 2023 / 12:57 PM IST

Pawan Kalyan And Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు .హైద్రాబాద్లోని చంద్ర బాబు నివాసంలో వీరు భేటి కాగా ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపై వీరు చర్చించుకోబోతున్నారు.
ఏపీ ప్రభత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవోనెం 1పైనా తాజా భేటీలో ఇరువురు నేతలు మాట్లాడుకోబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే అక్రమ కేసులు, దాడులు వంటి అంశాలపై మాట్లాడుకుంటున్నారు.
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారో అనేది ఉత్కంఠగా మారింది. పొత్తుపై తెగ ప్రచారం జరుగుతుండగా.. వీళ్లిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో పవన్ విశాఖ పర్యటనపై ఆంక్షలు విధించిన సమయంలో చంద్రబాబు ఆయన్ను కలిశారు.