జగన్ పరువు మొత్తం పోయింది, క్షమించరాని నేరం ఇది !

Admin - December 17, 2020 / 03:29 PM IST

జగన్ పరువు మొత్తం పోయింది, క్షమించరాని నేరం ఇది !

ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కామన్ అయిపొయింది. చేసింది గోరంతయితే చెప్పేది కొండంత అనేలా బిల్డప్స్ ఇస్తుంటారు. ఇక ఇదే నేపథ్యంలో ఒక కీలక నేత సెల్ఫ్ డబ్బా కొట్టుకుపోయి రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయాడు. అది ఎవరో కాదు ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే ఆయన ట్విట్టర్ లో చేసిన ట్విట్ సంచలనంగా మారింది. ‘ ఏపీలో డిసెంబర్ 25వ తేదీ నుండి కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, సీఎం జగన్ ఆదేశాల మేరకు 4762 కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుందని.. కోటి కరోనా టెస్టులు నిర్వహించి, వైరస్ ను కట్టడి చేయడంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ‘ ట్వీట్ చేసాడు.

ఇక ఇలా పెట్టిన ట్వీట్ ను కొద్దీసేపట్లోనే డిలేట్ చేసాడు విజయసాయి రెడ్డి. అసలు ట్వీట్ ఎందుకు చేశాడా.. మల్లి ఎందుకు డిలేట్ చేశాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరిలో వస్తుందని, రాష్ట్రాలన్నీ వాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇక కేంద్ర సర్కార్ ఏమో జనవరిలో వ్యాక్సిన్ వస్తుందని చెబుతుంటే, ఏపీలో డిసెంబర్ 25 నుండి వాక్సినేషన్ చేస్తామనే ఎంపీ గారి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుందామని భావించిన విజయసాయి రెడ్డి.. ఒక్కసారిగా తన పరువు అంత గాలిలో కలిసిపోయింది. ఇక ఆయన చేసిన ఒక్క ట్వీట్ తో వైసీపీ పార్టీది, సీఎం జగన్ మోహన్ రెడ్డిది పరువంతా పోయింది.

ఇక కోటి కరోనా టెస్టులు చేశామని చెప్పడం. వైరస్ ను కట్టడి చేశామని చెప్పే మాటలు కూడా కాస్త విడ్డురంగా ఉన్నాయి. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కరోనా కేసులు పెద్ద మొత్తంలో నమోదయ్యాయి. ఇక దీన్నిబట్టి చూస్తే ఏపీ కంటే తెలంగాణ వంద రేట్లు బెస్ట్ అని చెప్పాలి. ఇక వైరస్ ను కట్టడి చేశామని విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. అసలు విసా రెడ్డి తెలిసి చేశాడా, తెలియక చేశాడా అనేది ఇప్పటివరకు కూడా అర్ధం కావడం లేదు. ఏదిఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి చేసిన ఒక్క ట్వీట్ తో జగన్ పరువు మొత్తం తీసేశాడని ప్రతిపక్ష పార్టీలు గుసగుసలాడుతున్నాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us