CM Jagan: జగన్ సర్కార్ 15 వేల కోట్ల భారీ స్కామ్ ..? ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు

CM Jagan జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తన మీద కానీ, తన మంత్రి వర్గ సభ్యుల మీద కానీ ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన చేస్తున్నాడు. అయితే అదంతా ఒక వైపు అని ఇంకో వైపు భారీ అవినీతి జరుగుతుందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు చేశాడు. జీవోనెం-72తో విశాఖపట్నంలో 6వేలఎకరాలకు పైగాకాజేసిన జగన్ ప్రభుత్వం, దానిలో 30లక్షల గజాలను కొట్టేసి, రూ.15వేలకోట్ల దోపిడీకి పాల్పడింది నిజమోకాదో సజ్జల చెప్పాలి.సజ్జల రామకృష్ణారెడ్డి చిలుకపలుకులు మానేసి, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనెం-25, జీవోనెం-72పై సమాధానంచెప్పాలి.

Dhulipalla Narendra

దళితుల అసైన్డ్ ల్యాండ్స్ ని సోలార్ పవర్ కంపెనీలకు ధారాధత్తంచేయడానికిజీవోనెం -25 తీసుకురావడం నిజమాకాదా? రాజధానిముసుగులో విశాఖలోని భూములు కొట్టేయడానికి జీవోనెం-72 తీసుకొచ్చిన మాట వాస్తవమో కాదో సజ్జల చెప్పాలి. దళితులను ఒప్పించి, వారిచ్చే ఎకరాభూమికి 1000 గజాల రెసిడెన్షియల్ ల్యాండ్, 450 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు దళితద్రోహిఎలా అవుతారు? అంటూ ధూళిపాళ్ల ప్రశ్నించాడు.

01-01-2015న జీవోనెం-1ని నాటిప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్స్ కి సంబంధించి ఏవిధంగా భూసేకరణ చేయాలో చెబుతూ ఇచ్చింది. సీఆర్డీఏ చట్టమొచ్చిన రెండురోజుల తర్వాత జీవో నెం-1 ఇచ్చారు.
దానిలో పేజీనెం-4లో రెసిడెన్షియల్ ల్యాండ్ కి 800గజాలు, కమర్షియల్ ల్యాండ్ 100గజాలని చెప్పారు. జరీబుభూములైతే, రెసిడెన్షియల్ ల్యాండ్ 800గజాలని, కమర్షియల్ ల్యాండ్ 200గజాలని చెప్పారు.

విశాఖను రాజధానిగా ప్రకటించి, ఇళ్లస్థలాలపేరుతో జీవోనెం-72ద్వారా దళితుల నుంచి దాదాపు 6వేల ఎకరాలు కాజేసిన జగన్మోహన్ రెడ్డి నిజమైన దళితద్రోహి.తరతరాలగా దళితుల స్వాధీనంలో ఉన్న భూములను ఇళ్లపట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికే విజయసాయిరెడ్డిని అక్కడ మకాం వేసేలాచేశారు. జగన్ ప్రభుత్వం సేకరించిన 6వేల ఎకరాల్లో ప్రభుత్వానికి (ఉడాకు) 30నుంచి 40లక్షల గజాల భూమి అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ భూమి విలువ గజం రూ.5వేలు వేసుకున్నా రూ.15వేలకోట్లవరకు ఉంటుంది అంటూ సజ్జల ఆరోపణలు చేశాడు.

Advertisement