జగన్ కోడి కత్తికీ – నాని తాపీ కత్తికీ తేడా ఇదే ?

జగన్ కోడి కత్తి -నాని తాపీ కత్తి” అంటూ ఉదయం నుండి సోషల్ మీడియా లో అనేక కామెంట్స్ వస్తున్నాయి. ఏపీ మంత్రి పేర్ని నాని మీద హత్యాయత్నం జరగటం అనేది ఆంధ్రాలో తీవ్ర అలజడి సృష్టిచింది. మంత్రి పేర్ని నాని తన ఇంట్లో వుండగా, ఓ వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బెల్ట్‌ ధరించి వుండడం, ఆ బెల్ట్‌ బకెల్‌ కాస్తా తాపీ దాడిని అడ్డుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

perni nani and cm jagan

కోడి కత్తి

సరిగ్గా 2019 ఎన్నికలకు కొద్దీ నెలలు ముందు విశాఖ పర్యటనలో ఉన్న జగన్, హైద్రాబాద్ వెళ్ళటం కోసం ఎయిర్పోర్ట్ లో వేచిఉన్న సమయంలో జగన్ మీద హత్యాయత్నం జరిగింది. కోడి పందేలకు ఉపయోగించే పదునైన కత్తితో ఆయన మీద దాడి జరిగింది. ఆ దాడిలో జగన్ కు చిన్న గాయం అయ్యింది, అయితే ఆ దాడి మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిపోయింది. ఆ దాడిని టీడీపీ కుట్రగా అభివర్ణించింది వైసీపీ. కాదు కాదు, అది వైసీపీ డ్రామా అని టీడీపీ ఆరోపించింది. ఏళ్ళు గడుస్తున్నాయి.. అసలు ఆ దాడి వెనుక వున్నదెవరు.? అన్నదానిపై ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు సందేహాలు వీడలేదు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలూ వాస్తవాల్ని వెలుగులోకి తేలేకపోవడం గమనార్హం.

తాపీ కత్తి

ఇప్పుడు మంత్రి పేర్ని నాని మీద హత్యాయత్నం జరిగింది, తాపీతో జరిగిన ఆ దాడిలో నానికి ప్రమాదం ఏమి జరగపోయిన కానీ, అసలు ఒక తాపీ పనిచేసుకునే వ్యక్తి ఏకంగా మంత్రి మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి..? అది కూడా అనేక వంకర్లు తిరిగిన తాపీతో..? సరే దాడి ఏ విధంగా అయిన జరగని కానీ, ఇలాంటి దాడులకు ప్రజాస్వామ్యంలో చోటు ఉండకూడదు. దాడి ఎవరి మీద జరిగిన దానిని తీవ్రంగా ఖండించాలి, అదే సమయంలో దాడి చేయటానికి గల కారణాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో సీఎం జగన్ మీద కోడి కత్తి కేసులో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలూ వాస్తవాల్ని వెలుగులోకి తేలేకపోవడం గమనార్హం. ఇక ఇప్పుడు తాపీ కత్తి దాడి వెనుక వాస్తవాలను ఎప్పుడు చేస్తారో ఏమో..

Advertisement