రౌడీయిజానికి జగన్ లైసెన్స్ ఇచ్చాడు.. సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే అసైన్ట్ భూముల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వటాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా టీడీపీ శాసనమండలి సభ్యుడు మంతెన సత్యనారాయణ రాజు జగన్ మీద తీవ్రమైన విమర్శలు చేశాడు.

mantena satyanarayana raju

రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తల అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. రాష్ట్రంలో రౌడియిజానికి జగన్ లైసెన్స్ ఇచ్చినట్టున్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే మూల్యం చెల్లించక తప్పదు
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేసిన వైసీపీ నేతలు ఎన్నికలయ్యాక కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ వారి ఆర్దిక మూలాలు దెబ్బతీస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రౌడీయిజం చేసుకునేందుకు 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్ లైసైన్స్ ఇచ్చినట్టున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్చలేకకుండా పోయింది, రాష్టంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నేరస్తులే పాలకులైతే రాష్ట్రం ఎంత అధోగతి పాలు అవుతుందో, ప్రజల ధన మాన ప్రాణాలకు ఎంత అభద్రత వాటిల్లుతుందో వైసిపి పాలనలో అగత్యాలే నిదర్శనం.జగన్ రెడ్డి ఎల్లప్పుడు నియంతగా వ్యవహిస్తానంటే కుదరదు.

”ఒకరిని అరెస్టు చేస్తే వంద గొంతులు పైకి లేస్తాయి. వంద మందిని అరెస్టు చేస్తే వేల గొంతులు ప్రశ్నిస్తాయి” అని గుర్తుంచుకోవాలి. ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదు? దోషులను శిక్షించాల్సిన బాధ్యత, బాధితులను కాపాడాల్సిన కర్తవ్యం ఈ ప్రభుత్వానికి లేదా? రాష్ట్రంలో దాడులు జరగని రోజు ఉందా? ఏ ముఖ్యమంత్రి హయాంలో అయినా ఇన్ని అఘాయిత్యాలు జరిగాయా..? ఈ రెండేళ్లలో రాష్ర్టంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలపై సీబీఐ లేదా, హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. లేకపోతే జగన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ విమర్శలు చేశాడు మంతెన సత్యనారాయణ రాజు

Advertisement