Jagan: ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ అంటూ ప్ర‌చారం.. స్పందించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం

Jagan: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల‌లో నైట్ కర్ఫ్యూ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. నిన్న‌, మొన్న‌ లక్షకుపైగా కేసులు రావడంతో తీవ్ర భయాందోళకు గురుచేస్తోంది. కేసులు రెట్టింపు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కొన్ని రాష్ట్రాలు సూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి.

jagan decided to start night curfew in ap
jagan decided to start night curfew jagan decided to start night curfew in apin ap

ఈనేపథ్యంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నైట్ కర్ప్యూ విధించాలని నిర్ణయించింది అంటూ కొంద‌రు అస‌త్య ప్ర‌చారాలు చేశారు. కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభణ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చిందని.. థియేటర్లలో 50 శాతం మాత్రమే అక్యుపెన్సీ అంటూ పలు మెసేజ్‌లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.రాష్ట్రంలో ఎలాంటి నైట్ కర్ఫ్యూ లేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ చేసే వారి గురించి ఆరా తీస్తున్నామన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా, రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు తెలిపారు.

ఏపీకి పొరుగు రాష్ట్రాలైన , తమిళనాడు, ఒడిషా ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. సండే రోజు లాడ్‌డౌన్ విధించాలని సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అమలు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా వికెండ్ కర్ఫ్యూ విధించాలని ఆదేశాలు ఇచ్చింది.

jagan decided to start night curfew in ap
jagan decided to start night curfew in ap

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండం చేస్తోంది. ముంబైలో ఒక్క‌రోజులోనే 20,000 కేసులు న‌మోదు కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ దిశగా సీఎం ఉద్దవ్ ఠాక్రే సర్కార్ యోచిస్తోంది. కరోనా, ఒమిక్రాన్ కేసులకు ముంబై హాట్ స్పాట్ గా మారింది.