Etela Rajender: కేసీఆర్ కు రాజీనామా సవాల్ విసిరినా ఈటల..? అసలైన ఓనర్ ఎవరో తేల్చుకుందాం..!

PBN - May 7, 2021 / 12:34 PM IST

Etela Rajender: కేసీఆర్ కు రాజీనామా సవాల్ విసిరినా ఈటల..? అసలైన ఓనర్ ఎవరో తేల్చుకుందాం..!

Etela Rajender ఈటల రాజేందర్ వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని, కేవలం పార్టీ నుండి బహిష్కరించటమే కాకుండా ఏకంగా జైలుకు పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు గాసిప్స్ వచ్చాయి, అయితే ఇప్పుడు ఈటల విషయంలో తెరాస పార్టీ కొంచం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఈటల వ్యవహారం చూసిన తర్వాత తొందర పడి ఏమైనా నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని భావించిన తెరాస ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

etela rajendar

క్యాబినెట్ నుండి ఈటలను బర్తరఫ్ చేసిన వెంటనే దాదాపు ఐదారొందలు వాహనాలతో భారీ ర్యాలీగా హుజురాబాద్ వెళ్లిన రాజేందర్ కు నియోజకవర్గంలో యుద్ధం గెలిచి వచ్చిన ధీరుడికి స్వాగతం పలికినట్లు పలికారు.. దీనిని బట్టి చూస్తే ఈటల గట్టి ప్లాన్ తోనే ఉన్నట్లు తేలిపోయింది. ఇక తాము వేయడం కన్నా… ఈటలనే రాజీనామా చేస్తే బెటరన్న అంచనాకు టీఆర్ఎస్ హైకమాండ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఆయనపై రాజీనామాకు ఒత్తిడి తేవాలని వ్యూహం పన్నుతున్నారు. కానీ… కేసీఆర్ రాజకీయ శైలి గురించి బాగా తెలిసిన ఈటల మాత్రం.. కొత్త వాదన ప్రారంభించారు.

గజ్వేల్ నుంచి కేసీఆర్ కూడా రాజీనామా చేద్దామని.. ఎవరు గెలి్సతే.. వారే టీఆర్ఎస్ ఓనర్లు అనే వాదన తెస్తున్నారు. దీంతో ఈటల వివాదం విషయంలో టీఆర్ఎస్ దూకుడు తగ్గించినట్లుగా కనిపిస్తోంది. ఈటలను టార్గెట్ చేస్తున్నారన్న భావన ప్రజల్లో పెరిగితే సానుభూతి వస్తుందని.. ముందుగా ఆ విషయం పై దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నారంటున్నారు. గతంలోనే తెరాస కు అసలైన ఓనర్లు మేమె అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు ఎవరు మర్చిపోలేరు. ఒక రకంగా కేసీఆర్ కు ఈటల రాజేందర్ కు గ్యాప్ మరింత పెరగటానికి ఆ మాటలు కూడా కారణమనే చెప్పాలి. గతంలో డీఎస్ కూడా తెరాసకు వ్యతిరేకంగా వ్యవహరించటంతో అతనిపై బహిష్కరణ వేటు వేయాలని చుసిన కానీ, అలా చేస్తే సానుభూతి వస్తుందని భావించి సైలెంట్ గా ఉన్నారు.. ఇప్పుడు ఈటల విషయంలో కూడా అదే ధోరణితో ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us