TDP: పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై టీడీపీ వాదన ఇదేనా ?

TDP ఆంధ్రప్రదేశ్ జరగబోతున్న పరిషత్ ఎన్నికలను టీడీపీ పార్టీ బహిష్కరించింది. అయితే దీని పై పార్టీలోని కొందరు నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కార్యకర్తలు సైతం బాబు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ అగ్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణాలు ఇవే అంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ఎందుకు బహిష్కరించింది అంటే…….. చంద్రబాబు కు చేతకాకో, కార్యకర్తల్లో పోరాడే తత్వం లేకో కాదని ఎన్నికల్లో అరాచకాలు జరుగుతాయని వాటికీ ఇవే రుజువులు అంటూ కొన్ని లెక్కలు బయటకు వచ్చాయి.

-2014 పరిషత్ MPTC ఎన్నికల్లో
16,589 MPTC – 346 Unanimous – అంటే 2% ఏకగ్రీవాలు

2020 లో –
9,696 లకు, 2,362 ఏకగ్రీవం – 24 శాతం

2014 ZPTC
1,096 జడ్పీటీసీ లకు – ఒక్కటి మాత్రమే ఏకగ్రీవం. – ౦.౦9%.

2020 ZPTC
652 ZPTC లకు 126 ఏకగ్రీవం – 19% ఏకగ్రీవాలు

-ముఖ్యమంత్రి జిల్లా కడప లో, 2020 లో
– 553MPTC లకు 439 ఏకగ్రీవం – 79 %ఏకగ్రీవాలు.
50 ZPTC లకుగాను 38 ఏకగ్రీవం. – 76% ఏకగ్రీవాలు.

రాష్ట్రవ్యాప్తంగా 2,479 MPTCలో
– 1143 చోట్ల బలవంతపు ఉపసంహరణ చేశారు*
– 216 నామినేషన్లు తిరస్కరించారు*
– 325 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారు.*

జడ్పీటీసీల్లో
– 96 చోట్ల బలవంతపు ఉపసంహరణ,
– 19 చోట్ల నామినేషన్లు తిరస్కరించారు,
– 8 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు

ఇంతా కష్టపడి, పోటీ చేసినా, చివరకు ఫలితాలు ఎలా తారుమారు చేస్తున్నారో చూసారు..

– కరెంట్ తీస్తారు,
– ఏజెంట్ ను బయటకు తోసేస్తారు
– ఇష్టం వచ్చినట్టు రీకౌంటింగ్ పెడతారు..
– అన్ని జరిగిన తరువాత తెలుగుదేశం గెలిస్తే తరువాత మళ్ళీ, మాకు ఓటు వేయలేదు అంటూ దాడులు, సంక్షేమ పథకాల్లో కోత

ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి కనుక చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను, చంద్రబాబును అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికీ ఈ విషయాలు అర్థం అవుతాయి. అసలు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పాలన ఎలా కొనసాగిస్తుంది అనే విషయం ప్రజల్లో చర్చ జరగాలనేది చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యమంటూ కొందరు టీడీపీ శ్రేణులు చెపుతున్న మాటలు

Advertisement