జగన్ ‘ భూ సర్వే ‘ పథకంలో ఇంత పెద్ద స్కామ్ ఉందా ?
PBN - December 24, 2020 / 03:38 PM IST

గత వందేళ్ల కాలంలో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేపిస్తున్నాడు . 950 కోట్లు ఖర్చుపెట్టి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సర్వేకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని వైసీపీ నేతలు మహా యజ్ఞంగా చెపుతుంటే టీడీపీ మాత్రం ఇది భూములను దోచుకోవడానికే అంటూ సంచలన ఆరోపణలు చేస్తుంది.
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రజల ఆస్తులు దోచేందుకు సీఎం జగన్ ప్రణాళికలు వేస్తున్నారని విమర్శించారు. చుక్కల అసైన్డ్ సొసైటీ.. ఇలా 6 రకాల భూములపై ఆయన కన్నుపడిందని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల తెదేపా ఇన్ఛార్జ్లు సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా ఏరోజుకారోజు భూములను సరిచూసుకునే పరిస్థితి నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ అండగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోందని చంద్రబాబు విమర్శించారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలోనూ వందల కోట్ల రూపాయల భూకుంభకోణాలు జరిగాయని అన్నారు. వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్ని వేధించడం దాడులు దౌర్జన్యాలతో బెంబేలెత్తించడమే వైసీపీ అజెండా అని విమర్శించారు. ఈ ప్రభుత్వం మొదట ఇసుక మాఫియా కు దిగింది. ఇప్పుడు ల్యాండ్ మాఫియా కు సిద్ధమైంది.వైసిపి నాయకుల కన్నుపడ్డ భూమి గల్లంతే.. ఒకవైపు వైసిపి నాయకులు భూబకాసురుల్లా మారి భూములను మింగేస్తూ, ఇంకోవైపు భూరక్ష-భూహక్కు అనడం దయ్యాలు వేదాలు వల్లించడమే…
టీడీపీ హయాంలో 15 వందల రూపాయలకే దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 8వేల రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి వచ్చింది. ఇళ్ల స్థలాలకు ఏమాత్రం పనికిరాని ముంపు భూములు ఆవ భూములు విపరీతమైన ధరలకు ప్రభుత్వంతో కొనిపించి వేలకోట్లు దుర్వినియోగం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. శాండ్- ల్యాండ్ వైన్ -మైన్ మాఫియా దోపిడీకి హద్దుపద్దు లేకుండా పోతుందంటూ ఆరోపించారు. ఇళ్ల స్థలాల కొనుగోలు వ్యవహారంలో వైసీపీ నేతలు నాలుగు వేల కోట్ల అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశాడు.