Telangana: ఎలక్షన్ కమిషన్ ఆకాశంలో ఉందా ..? హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Telangana కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కంటే తెలంగాణ హైకోర్టు ఎక్కువ శ్రద్ద పెట్టినట్లు సృష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం విచారణ చేప్పట్టిన కోర్టు, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాచిన వేళ ఎన్నికలు నిర్వహించటం అవసరమా అంటూ ఎలక్షన్ కమిషన్ పై నిప్పులు చెరిగింది. అదే విధంగా కేసీఆర్ సర్కార్ కు చాకిరేవు పెట్టింది హైకోర్టు.

HIGHCOURT

రేపటితో రాత్రి పూట క‌ర్ఫ్యూ ముగుస్తుంద‌ని, అనంత‌ర చ‌ర్య‌లేంట‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. ప‌రిస్థితిని స‌మీక్షించి రేపు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ఏజీ ప్ర‌సాద్ స‌మాధానం ఇచ్చారు. ఏజీ స‌మాధానంపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ….‘చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేం ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి’ అని హితవు ప‌లికింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోపు చెబుతామని ఏజీ చెప్పి హైకోర్టును శాంత‌ప‌రిచారు.

ఆ తర్వాత ఎస్ఈసీ పై విచారణ చేప్పట్టిన కోర్టు, దీనికి వివరణ ఇవ్వాల్సిదింగా ఎస్ఈసీ ని కోరింది. ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చామని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్ ప్ర‌జ‌ల ప్రాణాలు పోతుంటే ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్లార‌ని ఎస్ఈసీని హైకోర్టు ప్ర‌శ్నించింది. ప్ర‌జ‌ల ప్రాణాలా? ఎన్నిక‌లా?… ఏవి విలువైన‌వ‌ని ఎస్ఈసీని హైకోర్టు నిల‌దీసింది.యుద్ధం వచ్చినా.. ఆకాశం మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అని గ‌ట్టిగా ప్ర‌శ్నించింది.

అస‌లు ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్నారా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ అత్యంత ఘాటు ప్ర‌శ్న‌ల‌తో ఎస్ఈసీని ఉతికి ఆరేసింది.
రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గాల్సిన అవ‌స‌రం ఏంట‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు మండి పడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. చివ‌రికి ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించడం గ‌మ‌నార్హం

Advertisement