తెలంగాణ మీడియా అమ్ముడుపోయిందా..? ఇదేనా మీడియా నీతి ..? మూల్యం తప్పదు

మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే అన్నారు ఒక మేధావి గతంలో, కానీ నేడు మీడియా అనేది అధికారపక్ష పార్టీకి తొత్తుగా మారిపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్నటికి నిన్న మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం చూస్తే తెలంగాణ మీడియా ఎలా తయారైందో సృష్టంగా అర్ధం అవుతుంది. ఈటెలకు సంబంధించిన న్యూస్ తెలంగాణ లోని మూడు ప్రధాన చానెల్స్ లో ఒకేసారి ప్రసారం అయ్యాయి. ఎవరో మూడు చానెల్స్ రిమోట్స్ ఆన్ చేసినట్లు చేశారు ..

Speech on Media - Essay & Speeches
కేవలం ఆ వార్తను మాత్రమే క్యారీ చేయకుండా దానికి ఇష్టం వచ్చిన రీతిలో హెడ్డింగ్స్ పెట్టి, దారుణమైన పదాలతో కంటెంట్ రాసి, తమ కసిని మొత్తం తీర్చుకోవాలి అన్నట్లు వార్తలు ప్రసారం చేశారు .. కనీసం మంత్రి అనే గౌరవం లేకుండా ఏకవచన సంబోధలు, వెటకారపు మాటలతో ఈటెలను మానసికంగా ఇబ్బంది పెట్టె విధంగా చేయాల్సిన పనులన్నీ చేశారు .

ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాకముందే, ఆయన్ని మీడియా దోషిని చేసేసి, పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వడ్డించారు. కనీసం మీడియా బాధ్యత మర్చిపోయి వ్యవహరించారు. బాధిత వ్యక్తి యొక్క వివరణ కూడా తీసుకోకుండా దోషిని చేసి మాట్లాడటం భావ్యమా..? ఆ తర్వాత జరుగుతున్నా నష్టం తెలుసుకొని స్వయంగా ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నేను తప్పేమి చేయలేదని, విచారణ చేయండి.. తప్పు అని తెలిస్తే దేనికైనా సిద్దమే అని ప్రకటించిన కానీ, కొన్ని మీడియా సంస్థలు అవేమి తప్పించుకోకుండా పాత పాటే పాడాయి.

దీనిని బట్టి చూస్తే  అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించటమే ఆయా చానెల్స్ ప్రథమ కర్తవ్యమని అర్ధం అవుతుంది. తమ ఇష్ట నేతలు ఎవరి మీద కోపంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి పీక పిసకటమే ఆయా మీడియాల ప్రధాన లక్ష్యమని తెలుస్తుంది. ఎప్పుడైతే మీడియాలోకి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు అడుగుపెట్టారో.. అప్పటినుండి మీడియా కూడా వాళ్లకు అనుకూలంగా మారిపోయింది.. తమ తమ నేతలు స్వలాభాలే వాళ్లకు కావాలి తప్ప ప్రజల మనోభావాలతో అవసరం లేదనే స్థాయికి వచ్చాయి..

అయితే ఇలాంటి ధోరణి ఎల్లప్పుడూ సాగదు. ప్రజలేమీ అమాయకులు కాదు. ఎవరు ఏంటి..? ఏ మీడియా ఎవరికీ అనుకూలంగా వ్యవహరిస్తుందో ఇప్పటికే అర్ధం అయ్యింది.. దానికి ఉదాహరణే ఈటెల వ్యవహారం.. తెలంగాణ లో అధికార పార్టీకి అనుకూలమైన మూడు ప్రధాన చానెల్స్ లో ఈటెల అవినీతి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన కానీ, ప్రజలు వాటిని పట్టించుకోలేదు సరికదా..? అవన్నీ కుట్రలో భాగమే అనే ఆలోచనకు వెళ్లిపోయారు.. ఈ ఒక్క సంఘటన చాలు తెలంగాణలోని కొన్ని మీడియా సంస్థల పట్ల ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందొ.. ఇప్పటికైనా అది గమనించి పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే ఆ మీడియా సంస్థలకు తగిన గౌరవం ఉంటుంది..

Advertisement