Etela Rajender: గన్ మెన్స్ లేకుండా ఈటెల కలిసింది ఎవరిని..? వేటుకు అదే కారణమా..?

Etela Rajender తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన తెరాస పార్టీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. అసైన్డ్ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేయటమే కాకుండా బాధితులను బెదిరించాడు అనే ఆరోపణలతో ఈటలను తన మంత్రి వర్గం నుండి తొలిగించాడు కేసీఆర్. అయితే ఈటలను తొలిగించటం వెనుక అసలు కారణం అది కాదని మరొకటి ఉందని మొదటి నుండి తెలంగాణ ప్రజానీకం సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

etela rajender gives clarity about his new party

తాజాగా ఒక ప్రముఖ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే అసలు కారణం మరొకటి ఉందని తెలుస్తుంది. గత నెల రోజుల క్రితం ఈటల రాజేందర్ తన గన్ మెన్స్ ను వదిలిపెట్టి ఉదయం ఐదున్నర సమయంలో కొందరు వ్యక్తులను కలిసినట్లు రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే తెలిసింది. సరిగ్గా 15 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి లో ఒక బ్యానర్ ఐటెంలో తెరాస కు చెందిన కీలక నేత రహస్య మంతనాలు చేస్తున్నాడని, ఆ నేత పార్టీకి నమ్మిన బంటు అని, అదే పార్టీలో ఎదిగిన నేతంటూ ఈటెల పేరు చెప్పకుండా ఆయనే అన్నట్లు హింట్ ఇచ్చేలా వార్తను క్యారీ చేసింది.

రేవంత్ మాట్లాడిన మాటలు, ఆంధ్రజ్యోతి లో వచ్చిన సమాచారం రెండు ఒకటే అని అర్థమైంది. అయితే ఈటల కలిసిన వ్యక్తులు ఎవరనేది సరిగ్గా బయటకు రాలేదు, కానీ అదే డిబేట్ లో యాంకర్ సూటిగా రేవంత్ రెడ్డిని అడుగుతూ ఈటల ఈ మధ్య కాలంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసినట్లు వార్తలు వచ్చాయి నిజం కదా..? మీరు విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితుకు కాబట్టి ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని అడగటంతో రేవంత్ రెడ్డి అవును నాకు తెలుసంటూ చెప్పాడు..

దీనిని బట్టి చూస్తే ఈటల గత కొద్దీ రోజుల నుండి తెరాస వ్యతిరేక శక్తులతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సృష్టం అవుతుంది. దాదాపు రెండేళ్ల నుండి కేసీఆర్ కు ఈటలకు మధ్య అంత సయోధ్య లేకపోవటంతో ఎప్పుడో ఒకప్పుడు తనను పార్టీ నుండి బయటకు పంపటం ఖాయమని ముందే గ్రహించిన ఈటల రాజేందర్ ముందు జాగ్రత్తగా తన ఆయుధాలను సిద్ధం చేసుకునే క్రమంలో యాంటీ తెరాస వర్గాలకు దగ్గర అయ్యినట్లు కూడా మనం భావించవచ్చు.. ఈ విషయాలు తెలిసిన తర్వాత ఇక ఆలస్యం చేయటం మంచింది కాదని బావించాడేమో కానీ కేసీఆర్ వెంటనే ఈటల మీద చర్యలకు దిగాడు.. మరి మున్ముందు ఈ ఎపిసోడ్ ఎటు వైపు టర్న్ అవుతుందో చూడాలి

Advertisement